Homeజాతీయ వార్తలుPV Narasimha Rao: కాంగ్రెస్‌ ఐకాన్‌లను తన ఖాతాలో వేసుకుంటున్న బీజేపీ.. తాజాగా ఘనంగా తెలుగు...

PV Narasimha Rao: కాంగ్రెస్‌ ఐకాన్‌లను తన ఖాతాలో వేసుకుంటున్న బీజేపీ.. తాజాగా ఘనంగా తెలుగు నేత జయంతి!

PV Narasimha Rao: ప్రధాని మోదీ వేసే ఎత్తులు ఎవరికీ అర్థం కావావు. మోదీ కాంగ్రెస్‌కు చెందిన ఐకానిక్‌ వ్యక్తులను లాగేసుకుంటున్నారు. తాజాగా మరో కీలక వ్యక్తిని లాగేశారు. 130 ఏళ్ల చరిత్రగల కాంగ్రెస్‌ ప్రస్తుతం ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా, అభివృద్ధికి మార్గదర్శకుడిగా చెప్పుకుంటుందో ఆయన కాంట్రి బ్యూషన్‌ను ముందుకు తీసుకొస్తున్నారు. 2024లో మొదటి అడుగు వేశారు. భారత రత్న ప్రకటించారు. 2025లో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లి కలిశారు. మంచి గుర్తింపు ఇచ్చి […]

PV Narasimha Rao: ప్రధాని మోదీ వేసే ఎత్తులు ఎవరికీ అర్థం కావావు. మోదీ కాంగ్రెస్‌కు చెందిన ఐకానిక్‌ వ్యక్తులను లాగేసుకుంటున్నారు. తాజాగా మరో కీలక వ్యక్తిని లాగేశారు. 130 ఏళ్ల చరిత్రగల కాంగ్రెస్‌ ప్రస్తుతం ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా, అభివృద్ధికి మార్గదర్శకుడిగా చెప్పుకుంటుందో ఆయన కాంట్రి బ్యూషన్‌ను ముందుకు తీసుకొస్తున్నారు. 2024లో మొదటి అడుగు వేశారు. భారత రత్న ప్రకటించారు. 2025లో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లి కలిశారు. మంచి గుర్తింపు ఇచ్చి గౌరవించింది. తాజాగా ఆ వ్యక్తి పుట్టిన రోజును మూడు రోజులు నిర్వహించి ప్రధాన మంత్రులకు సంబంధించిన వస్తువులు, జ్ఞాపకాలు, స్మృతులు ఉన్న లౌబ్రరీలో జరిపించారు. కాంగ్రెస్‌ పట్టించుకోని గౌరవించని వ్యక్తిని ఇప్పుడు బీజేపీ ఓన్‌ చేసుకుంటోంది. ఆయనే పీవీ.నర్సింహారావు. తెలుగు, తెలంగాణకు చెందిన వ్యక్తి. కాంగ్రెస్‌ కోసం జీవితాంతం పనిచేశారు. అత్యంత సరళమైన జీవితం గడిపారు. అధికారానికి సమీపంలో ఉండి కూడా ఇంటలెక్చువల్‌ ప్రధానిగా గుర్తింపు పొందారు.

2024లో భారత రత్న..
2024లో కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న పురస్కారం ఇచ్చింది. ఆయన దేశంలో ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకత్వం వహించిన వ్యక్తిగా గుర్తింపు లభించింది. 2025లో ప్రధాని నరేంద్ర మోదీ ఆయన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా కలిసి గౌరవించారు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా జూన్‌ 28, 29, 30 తేదీల్లో ప్రధాన మంత్రుల స్మృతి గ్రంథాలయంలో మూడు రోజుల వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశ అభివృద్ధిలో పీవీ పాత్రను వివరించారు. పీఎంవోలోని కీలక అధికారి ఈ వేడుకలకు నాయకత్వం వహించడం ద్వారా ప్రభుత్వం ఆయన వారసత్వాన్ని బలంగా ప్రచారం చేస్తోంది.

చివరి వరకు కాంగ్రెస్‌లోనే ఉన్న పీవీ..
పీవీ నరసింహారావు ప్రధాని పదవి ముగిసిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఆయనను పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోంది. జార్ఖండ్‌ ముక్తిమోర్చా సంబంధిత కేసులో పార్టీ నుంచి సహకారం లభించలేదు. దీంతో ఆయన ఇంటిని అమ్ముకుని కేసులు ఎదుర్కొన్నారు. ఆయన మరణానంతరం అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించేందుకు కూడా సోనియాగాంధీ అంగీకించలేదు. దీంతో కొందరు నేతలు హైదరాబాద్‌ తీసుకువచ్చి నిర్వహించారు. ఆయన సరళమైన జీవితం, బుద్ధిజీవి నాయకత్వం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ఆయనను తన వారసత్వంలో భాగం చేయలేదు.

కీలక నేతలను ఓన్‌ చేసుకుంటున్న బీజేపీ..
బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలను ఇతర చారిత్రక వ్యక్తులకు కూడా విస్తరించింది. కాంగ్రెస్‌ పక్కన పెట్టిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు నర్మదా ప్రాజెక్టు వద్ద భారీ విగ్రహం నిర్మించింది. మదన్‌ మోహన్‌ మాలవ్యకు భారత రత్న ప్రదానం చేసింది. సుభాష్‌ చంద్రబోస్, డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ వంటి నాయకులను కూడా తన రాజకీయ కథనంలో భాగం చేసుకుంటోంది. కాంగ్రెస్‌ గొప్పగా చెప్పుకునే వ్యక్తులను బీజేపీ తన వైపుకు లాగుతున్నట్లు ఈ ఘటనలు సూచిస్తున్నాయి.

భారత రాజకీయాల్లో చారిత్రక వారసత్వం కోసం జరుగుతున్న పోటీని స్పష్టంగా చూపిస్తున్నాయి. బీజేపీ తన ఆదర్శాలకు అనుగుణంగా వివిధ నాయకులను గౌరవించడం ద్వారా విస్తృత మద్దతును పొందాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఈ నాయకులను నిర్లక్ష్యం చేయడం వల్ల బీజేపీకి ఈ అవకాశం దొరికిందని చెప్పవచ్చు.దేశ చరిత్రను తన వైపుకు తిప్పుకోవడానికి రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలను ఈ ఘటనలు హైలైట్‌ చేస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper