spot_img
Homeఆంధ్రప్రదేశ్‌పైసల కోసం ఆఖరుకు ‘చెత్త’ను వదలని ఏపీ సర్కార్

పైసల కోసం ఆఖరుకు ‘చెత్త’ను వదలని ఏపీ సర్కార్

taxes on garbage

ఏపీ సర్కార్ బండి నడవడం లేదు. ఎన్ని అప్పులు చేసినా సరిపోవడం లేదు. అప్పులు ఎక్కువై ఆర్బీఐ కూడా ఖాతాల్లో సొమ్మును తీసేసుకుంది. దీంతో ఎలా? ఏం చేయాలి? ఆదాయం ఎలా పెంచాలి? అని ఆలోచించిన జగన్ సర్కార్ తాజాగా మాస్టర్ ప్లాన్ వేసింది. ‘చెత్త’పై పన్ను వేయాలని డిసైడ్ అయ్యింది. ఆఖరుకు చెత్తను కూడా వదలరా? అని జనాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

ఏపీలో ‘పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్’ (క్లాప్) కార్యక్రమాన్ని ఏపీ పురపాలకశాఖ నెత్తిన ఎత్తుకుంది. మొదటి దశలో 16 నగరపాలక సంస్థలు, 29 పురపాలక సంఘాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. రెండో దశలో అన్ని మున్సిపాలిటీల్లో దీన్ని అమలు చేస్తారు. ఈనెల 15న కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.

క్లాప్ అమలు కోసం మున్సిపాలిటీ పాలకవర్గాలు వెంటనే సమావేశమై ఆమోదం పొందించుకోవాలని పురపాలకశాఖ ఆదేశించింది. ఈ క్రమంలోనే అధికారులతో ఏజెండాను రెడీ చేస్తున్నారు. నివాసాల సంఖ్య, వ్యర్థాల సేకరణకు అయ్యే రవాణా ఖర్చులను బట్టి ఒక్కో చోట ఒక్కవిధంగా పన్ను వేయాలని కమిషనర్లు ప్రతిపాదిస్తున్నారు.

రాష్ట్రంలోని అన్ని పట్టణ, స్థానిక సంస్థల్లోనూ నివాసాలు, నివాసేతర నుంచి వ్యర్థాలు సేకరించి వినియోగ రుసుములు వసూలు చేయాలన్న నిర్ణయించింది. ఈ ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు, ప్రజాసంఘాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. పలు చోట్ల పురపాలక సభ్యులు సైతం కరోనా వేళ వినియోగరుసుములు వసూళ్లు ప్రతిపాదించడంపై వ్యతిరేకించారు.

గృహాలకు 120 రూపాయల పన్ను ఉండగా.. మురికివాడల్లోని గృహాలకు 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. స్టార్ హోటళ్లకు 15వేల వరకు పన్నులు వేస్తున్నారు. దుకాణాలకు రూ.300నుంచి రూ.5వేలలోపు వేస్తున్నారు.సినిమా హాళ్ల నుంచి సూపర్ మార్కెట్ల దాకా ప్రైవేటు విద్యాసంస్థలకు కూడా ‘చెత్త’పై పన్ను వేస్తూ ఏపీ సర్కార్ భారీగానే వసూళ్లు చేస్తోంది. ఖాజానా నింపుకుంటోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
Oktelugu Epaper