
ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో పులిచింతల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. పులిచింతల ప్రాజెక్ట్ లో ఇవాళి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం ఆపివేస్తున్నట్లు తెలంగాణ జెన్ కో ప్రకటించింది. పులిచింతల నీటి కెపాసిటీ 45 టిఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం 40 టీఎంసీలుగా కొనసాగుతోంది.