Chandrababu Naidu: ప్రకృతి ప్రకోపాన్ని ఎవరూ అంచనా వేయలేరు. ఆపలేరు. ఇప్పుడున్న టెక్నాలజీ తో తుఫాన్లను అంచనా వేయడం సాధ్యమే. ముందస్తు హెచ్చరికలు చెప్పడం కూడా సాధ్యమే. కానీ పక్కా ప్రణాళిక ఉంటే తప్ప నష్టాన్ని తగ్గించడం సాధ్యం కాదు. దీనికోసం టెక్నాలజీని వాడుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలి. ప్రతి వ్యవస్థ కూడా సమన్వయంతో పని చేయాలి. దానివల్ల ప్రాణనష్టం తగ్గుతుంది. ఆస్తి నష్టం కూడా తగ్గుతుంది. సరిగా ఇదే విధానాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమల్లో పెట్టారు.
ఏపీ రాష్ట్రంలో ఇటీవల ఆరు రోజుల వ్యవధిలో రెండు తుఫాన్లు విధ్వంసాన్ని సృష్టించాయి. అక్టోబర్ 28న అర్నబ్ తుఫాను నరసాపురం సమీపంలో తీరం దాటింది. నవంబర్ 3న మురసు తుఫాను ఒంగోలు సమీపంలో తీరం దాటింది. ఈ రెండు తుఫాన్లు దాటికి రాష్ట్రంలో పలు జిల్లాలో అతలాకుతలమయ్యాయి. లక్షల ఎకరాలలో పంట నీట మునిగింది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ ముందస్తు చర్యలు.. వేగవంతమైన సహాయక చర్యల ద్వారా భారీ ప్రాణనష్టాన్ని ప్రభుత్వం తగ్గించింది.
ఈ రెండు తుఫానులను ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రియల్ టైం గవర్నెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. డ్రోన్లు.. శాటిలైట్ మ్యాపింగ్.. వాట్సాప్ గవర్నెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని విపత్తు నిర్వహణలో సమర్థవంతంగా ఉపయోగించారు. పరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ సిబ్బందిని రప్పించారు. పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేశారు.
ఆర్టిజిఎస్ కేంద్రంగా పర్యవేక్షణ
చంద్రబాబు ప్రభుత్వం ఈసారి తుఫానులను ఎదురుకోవడానికి రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ కేంద్రాన్ని కీలక సమన్వయ కేంద్రంగా ఉపయోగించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి నుంచే పరిస్థితిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు.. వివిధ శాఖల అధికారులతో నేరుగా మాట్లాడారు. వాతావరణ శాఖ హెచ్చరికలు.. క్షేత్రస్థాయి సమాచారం.. నష్టం అంచనాలు.. సహాయక చర్యలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పూర్తిగా విశ్లేషించారు.
మొదటి తుఫాన్ సమయంలో సుమారు 32,000 మంది అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమన్వయం చేసుకున్నారు. ఇక రెండవ తుఫాను వస్తున్నప్పుడు దాదాపు 45 వేల మంది క్షేత్రస్థాయి సిబ్బంది వీధులలో పాల్గొన్నారు. గ్రామ.. వార్డు.. సచివాలయాల సిబ్బంది నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి అధికారుల వరకు అందర్నీ ఒకే వ్యవస్థకు కిందికి తీసుకొచ్చారు.
ఏ ఐ ద్వారా
ఈసారి విపత్తుల నిర్వహణలో టెక్నాలజీకి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రాధాన్యం ఇచ్చింది. కృత్రిమ మేధ ఆధారిత అంచనాలు.. వాతావరణ సమాచారాన్ని ఉపయోగించింది. తుఫాన్లకు కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలను గుర్తించింది. అక్కడి ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసింది. డ్రోన్లను ఉపయోగించి నీట మురిగిన ప్రాంతాలు.. రాకపోకలకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాలు.. సహాయక బృందాలు చేరుకోవలసిన ప్రదేశాలను గుర్తించింది. తుఫాను ప్రభావంతో రహదారులు దెబ్బతిన్నా.. గ్రామాలు నీటిలో చిక్కుకున్నా.. ప్రత్యక్షంగా పరిశీలించడం సాధ్యం కానీ పరిస్థితిలో డ్రోన్లు ఉపయోగపడ్డాయి. షార్ట్ కట్ చిత్రాల ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహకారంతో వరద నీరు ఎక్కడెక్కడ విస్తరించిందో మ్యాపింగ్ చేశారు. దీనివల్ల సహాయక బృందాలను అవసరమైన ప్రాంతాలకు పంపించడానికి వీలైంది.
14 కోట్లకు పైగా మొబైల్ అలర్ట్స్
తుఫాన్ సమయంలో ప్రజలకు సమాచారం చేయటం అత్యంత ముఖ్యం. దీనికోసం కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్.. సెల్ బ్రాడ్ కాస్ట్ విధానాలను ఉపయోగించారు. రెండు తుఫాను సమయంలో కలిపి 14 కోట్లకు పైగా మొబైల్ అలర్టులను పంపించినట్టు ఆర్టిజిఎస్ అధికారులు వెల్లడించారు. వీటితోపాటు ఎస్ఎంఎస్.. టెలివిజన్.. వాయిస్ మెసేజ్ ల ద్వారా ప్రజలకు హెచ్చరికలు పంపించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేశారు. రైతులకు పంటల రక్షణ పై సూచనలు పంపించారు మొదటి తుఫాన్ సమయంలో దాదాపు 35.9 లక్షల మంది రైతుల కు సంబంధించిన పంటలపై ఎస్ఎంఎస్ సూచనలు అందించారు. 3.9 లక్షల మంది మత్స్యకారులు.. ఆక్వా రైతులకు వాయిస్ అలర్ట్ పంపించారు.
పొరుగు రాష్ట్రాల సేవలు
రెండు తుఫాన్లు వరుసగా రావడంతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ పై తీవ్రంగా ఒత్తిడి ఏర్పడింది. వేలాది విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. చెట్లు విరిగిపడి విద్యుత్తు లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిలో కేవలం రాష్ట్రంలోని సిబ్బందితోనే పునరుద్ధరణ పనులు చేయడం సాధ్యం కాదని గుర్తించిన చంద్రబాబు ఇతర రాష్ట్రాల సహకారం తీసుకున్నారు.. తమిళనాడు.. కర్ణాటక.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతోను మాట్లాడి విద్యుత్ సిబ్బందిని పంపించాలని కోరారు. మూడు రాష్ట్రాల నుంచి 1500 మంది విద్యుత్ సిబ్బంది.. ఇంజనీర్లు ఏపి కి చేరుకున్నారు. పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్నారు. అదే సమయంలో తమిళనాడు నుంచి మూడు అదనపు విపత్తు నిర్వహణ బృందాలను కూడా మోహరించారు. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల సిబ్బందితో కలిసి వేలాదిమంది పనిచేశారు. ఫలితంగా విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరించ గలిగారు.
వాట్సాప్ ద్వారా
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నమెంట్ సేవలను ఉపయోగించింది. ఎక్కడ చెట్లు కూలిపోయాయి.. ఎక్కడ విద్యుత్ సరఫరా ఆగిపోయింది.. ఎక్కడ వరద నీరు చేరింది.. ఎక్కడ తాగునీటి సమస్య ఉంది వంటి వివరాలను ప్రజలు వాట్సాప్ ద్వారా అధికారులకు తెలియజేయడానికి అవకాశం ఏర్పడింది. ఫిర్యాదు అందిన వెంటనే అధికారులకు సమాచారం చేరే విధంగా వ్యవస్థను అనుసంధానించారు. అర్నబ్ తుఫాను సమయంలో వచ్చిన 1500 కి పైగా ఫిర్యాదుల్లో 95 శాతానికి పైగా పరిష్కరించినట్టు అధికారులు ప్రకటించారు.
తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గర్భిణీలను ఆసుపత్రులకు తరలించారు. పశువులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేశారు. మత్స్యకారుల పడవలను సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. ప్రమాద ప్రాంతాల్లో సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. రేషన్ దుకాణాల్లో నిత్యవసర సరుకులను నిల్వ చేశారు. తాగునీరు.. వైద్య సేవలు. అంబులెన్సులు.. అత్యవసర మందుల విషయంలో ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు.
ఈ రెండు తుఫాన్లు రాష్ట్రానికి భారీ నష్టాన్ని మిగిల్చాయి. 5 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. నాలుగు పాయింటు ఏడు లక్షల హెక్టార్లకు పైగా పంట ప్రాంతాలు నీట మునిగాయి. ప్రాణ నష్టం కూడా ఉంది. అయితే విపత్తు నిర్వహణలో ముందస్తు హెచ్చరికలు.. ప్రజలను తరలించడం.. ఇతర రాష్ట్రాల నుంచి సహకారం తీసుకోవడం.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వంటివి నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి. తుఫాన్లను ఎదుర్కొనే విషయంలో గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించడం ఈసారి కొత్తగా కనిపించింది. ముఖ్యంగా ఆర్టిజిఎస్ కేంద్రం ద్వారా సమాచారాన్ని ఒకచోట చేర్చడం.. క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేయడం.. ఇతర రాష్ట్రాల నుంచి సహాయం తీసుకోవడం విపత్తు నిర్వహణలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తుఫాన్లను ఆపలేకపోయినా.. టెక్నాలజీతో ముందుగానే సిద్ధమై నష్టాన్ని తగ్గించవచ్చు. 76 సంవత్సరాల వయసులో చంద్రబాబు దీన్ని చేసి చూపించారు. కాగా, చంద్రబాబు చూపించిన చొరవ జాతీయ మీడియాలో చర్చకు దారి తీసింది.