Andhra Pradesh: శీర్షిక చదివారు కదా.. ఇదేంటి ఇంతలా ట్విస్ట్ ఇచ్చారు.. అసలు ఏం జరిగింది.. ఏమై ఉంటుంది అనే సందేహాలు మీలో ఉన్నాయి కదా.. మీ సందేహాలకు సమాధానమే ఈ కథనం.. ఇంతకీ మన ఆంధ్ర పట్టణాలు ఏం చేశాయి.. వాటిల్లో ఏం జరిగింది.. ముఖ్యంగా గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఏం జరిగి ఉంటుంది.. దీని గురించి తెలుసుకుందాం పదండి..
కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ పరిశుభ్రత సర్వే ఫలితాలను వెల్లడిస్తుంటుంది. దేశంలో పరిశుభ్రతను పెంపొందించడం.. స్వచ్ఛతను కాపాడటం దీని వెనుక ఉన్న ఉద్దేశం. పరిశుభ్రమైన నగరాల జాబితాను ప్రకటించి.. వాటికి ప్రోత్సాహకాలను కేంద్రం అందిస్తూ ఉంటుంది. ఈసారి కేంద్రం ప్రకటించిన జాతీయ ర్యాంకింగ్ ల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని మూడు పట్టణాలు కీలక స్థానాలలో నిలిచాయి. తద్వారా ఏపీలో మూడు పట్టణాల గురించి జాతీయస్థాయిలో చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. అమలు చేస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సర్వే ఫలితాల ప్రకారం దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మహారాష్ట్రలోని నవి ముంబై నిలిచింది. రెండో స్థానంలో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం నిలిచింది. ఇక మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నిలిచింది.
దక్షిణాది ప్రాంతాలలో విజయవాడ కంటే ఎన్నో పెద్ద నగరాలు ఉన్నాయి. హైదరాబాద్.. చెన్నై.. బెంగళూరు.. తిరువనంతపురం వంటి నగరాలు ఉన్నప్పటికీ.. వాటన్నిటిని దాటేసి విజయవాడ దేశంలోనే మూడవ స్వచ్ఛ నగరంగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పరిశుభ్రత మీద ప్రధానంగా ఫోకస్ చేసింది. తడి చెత్త.. పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తుంది. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నిర్మించిన కేంద్రాలను మరోసారి పునరుద్ధరించింది. చెత్త సేకరణ వాహనాలను పెంచింది. రోడ్లమీద చెత్త వేయకుండా ఎక్కడికక్కడ కుండీలను ఏర్పాటు చేసింది. తద్వారా విజయవాడ నగరం స్వచ్ఛతను సంతరించుకుంది. ఇటీవల కాలంలో ప్రభుత్వం విజయవాడ నగరం మీద మరిత ఫోకస్ చేయడంతో నగరం పరిశుభ్రంగా కనిపిస్తోంది. అందువల్లే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విజయవాడ మూడో స్థానంలో నిలిచింది.
ఇక జనాభా పరంగా చూసుకుంటే గ్రేటర్ విశాఖపట్నం మొదటి స్థానంలో గెలిచింది. 10 లక్షలు అంతకుమించిన జనాభా ఉన్న నగరాల జాబితాలో విశాఖపట్నం మొదటి స్థానంలో ఉంది. విశాఖపట్నం తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ రెండవ స్థానం.. ఉత్తరప్రదేశ్లోని లక్నో మూడో స్థానంలో ఉన్నాయి. జీవనానికి అనుకూలమైన పరిస్థితులు.. ఉపాధి అవకాశాలు.. ప్రభుత్వ అనుకూల నిర్ణయాల వల్ల విశాఖపట్నంలో జనాభా వృద్ధి చెందుతోంది. స్థానికులే కాకుండా.. ఇక్కడ అనేక రకాల ప్రాంతాలకు చెందినవారు జీవిస్తున్నారు. రకరకాల పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా ఐటి.. ఫార్మా.. లాజిస్టిక్స్.. వంటి రంగాలలో విశాఖపట్నం వృద్ధిని సాగిస్తోంది. ప్రభుత్వం కూడా ఐటీ పరంగా విశాఖపట్నం నగరానికి ప్రాధాన్యం ఇవ్వడంతో.. వృద్ధి వేగంగా సాగిపోతోంది. ఇతర ప్రాంతాల వారు ఇక్కడ వచ్చి నివసించడానికి ప్రధాన కారణం కూడా అదే. అందువల్లే విశాఖపట్నం దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న నగరంగా ఆవిర్భవించింది.
మూడు నుంచి పది లక్షల జనాభా ఉన్న నగరాలలో గుంటూరు మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మొదటి స్థానంలో ఉంది. పంజాబ్లోని చండీగఢ్ రెండవ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మూడో స్థానంలో ఉంది.. గుంటూరు నగరంలో ఈ స్థాయిలో జనాభా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఇక్కడ లభిస్తున్న ఉపాధి అవకాశాలు. స్థానికంగా అనుకూలంగా ఉన్న వనరులు.. ప్రభుత్వ విధానాలు కూడా అనుకూలంగా ఉండడంతో ఇక్కడికి చాలామంది వచ్చి ఉపాధి పొందుతున్నారు.
గతంలో కేంద్రం విడుదల చేసే జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి అంతగా ప్రాధాన్యం లభించేది కాదు. కానీ ఈసారి విజయవాడ.. విశాఖపట్నం.. గుంటూరు వంటి ప్రాంతాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మూడు ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేపడుతోంది. వాటి ఫలితాలు కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అందువల్లే ఈ మూడు నగరాలు జాతీయస్థాయిలో గుర్తింపు సాధించాయి. ఈ మూడు నగరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి.. సామాజిక అభివృద్ధికి.. పట్టుకొమ్మలు.