
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని బస్వాపురం రిజర్వాయర్ లో ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ ఇద్దరు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ ఉదయం రిజర్వాయర్ వద్ద చెప్పులు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. ఇద్దరు యువకులను లింగాల హేమంత్ (14), సింగిరెడ్డి పవన్ కుమార్ (14) గా పోలీసులు గుర్తించారు.