Foods : జీవితం చాలా చిన్నది అని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ చిన్న జీవితంలో ఎన్నో రకాల లక్ష్యాలు సాధిస్తూ గమ్యాలను చేరుకోవాలని అంటారు. ఈ క్రమంలో కొందరు చిన్నవయసు నుంచే ఎన్నో రకాల పనులు చేస్తూ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. అయితే కొందరు డప్పు సంపాదన, ఇతర పనుల కారణంగా ఆరోగ్యం పై శ్రద్ధ చూపడం లేదు. ముఖ్యంగా 30 ఏళ్ల వరకు ఉత్సాహంగా ఉన్నవారు ఆ తర్వాత మెల్లిమెల్లిగా నీరసంతో కనిపిస్తూ ఉంటారు. ఇలా 40 ఏళ్లు దాటిన తర్వాత మరి నీరసంగా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వయసులో మహిళలు కొన్ని పనులు చేయడానికి చాలా ఇబ్బందులకు గురవుతారు. అయితే 40 ఏళ్లు దాటిన వారు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి పరిష్కరించుకోవచ్చని అంటున్నారు. అవేంటంటే?
Also Read : రెగ్యులర్ గా ఈ ఆహార పదార్థాలు తింటే గుండెపోటు ను నివారించవచ్చు.. అవేంటో తెలుసా?
40 ఏళ్లు దాటిన తర్వాత మహిళల్లో ఒత్తిడి పెరిగిపోతుంది. అప్పటి వరకే ఉన్న బాధ్యతలతో సతమతమైన వారు ఈ వయసులో మానసికంగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అయితే ఈ సమయంలో సాధారణ ఆహారం తీసుకుంటే కొన్నిసార్లు ఆరోగ్యకరంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే సాధారణ జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అలాగే ఈ వయసులో ఎన్నో రకాల మార్పులు ఉండడంవల్ల సాధారణ ఆహారం అవసరమైన శక్తిని ఇవ్వలేదు. అందువల్ల ఈ వయసులో ఉన్నవారు ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకోవాలి.
విటమిన్లు, ప్రోటీన్లు కలిగిన ఫ్రూట్స్ను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దాదాపు అన్ని రకాల పండ్లలో కార్బోహైడ్రేట్లు, విటమిన్ లో ఉంటాయి. అయితే ఆరోగ్యరీత్యా ఎలాంటి పండ్లను తీసుకోవాలో వైద్యులను అడిగి వాటిని తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జొన్నలు, రాగులు వంటి తృణ ధాన్యాలను తీసుకోవడం వల్ల ఈజీగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.
40 ఏళ్లు దాటగానే మధుమేహం, గుండెపోటు వంటి వ్యాధులకు ఆస్కారం ఉంటుంది. అయితే ఈ సమస్య రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా మహిళలు వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్య నుంచి దాదాపు తప్పించుకోవచ్చు అని అంటున్నారు. అలాగే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సలాడ్ వంటి ఫ్రూట్స్ తో పాటు కొన్నిరకాల పండ్ల రసాలు కూడా తీసుకోవాలని అంటున్నారు. ఈ పండ్లలో ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉండే వాటిని ఎక్కువగా తీసుకోవాలి. వీటివల్ల అదనపు కొవ్వును కరిగించడమే కాకుండా బరువు పెరగకుండా ఉంటారు. అంతేకాకుండా ప్రతిరోజు ఉత్సాహంగా పనిచేయగలుగుతారని చెబుతున్నారు.
వీటితోపాటు అవసరమైన మాంసాహారం, గుడ్లు వంటివి అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. పీచు ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల నిత్యం యాక్టివ్ గా ఉండగలుగుతారు. అలాగే ప్రతిరోజు కనీసం ఐదు గ్లాసుల నీటిని తాగుతూ ఉండాలి. శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటే నీరసం ఉండదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మలినాలు బయటకు వెళ్తాయని అంటున్నారు.
Also Read : వంటింట్లో ఉండే దీనిని పచ్చిగా తింటే.. కొవ్వును కరిగించేస్తుంది..