Sleep : మనిషి ఆరోగ్యానికి నిద్ర కచ్చితంగా అవసరం. ప్రతిరోజు 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. నిద్ర గడియారం తప్పడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. అయితే నేటి కాలంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక పనితో బిజీగా ఉంటున్నారు. దీంతో మానసిక ఒత్తిడితో సాయంత్రం సరైన సమయానికి నిద్రపోవడం లేదు. కొందరు పనులు కాకుండా రాత్రిళ్ళు mobile, ఇతర కాలక్షేపాలతో నిద్రను చెడగొట్టుకుంటున్నారు. అయితే ఏ రకంగా నైనా నిద్ర చెడిపోవడం వల్ల మానసికంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. అసలు సరైన నిద్ర పోకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
నిద్ర గడియారం చెడిపోవడం వల్ల మానసికంగా ఆందోళనలతో ఉంటారు. దీంతో అనుకోకుండానే కోపం వస్తుంది. ఈ కారణంగా ఉద్యోగులు, వ్యాపారులు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఫలితంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారు. కోపం కారణంగా తీసుకొని నిర్ణయాలు కూడా తీవ్ర ఇబ్బందులను కలిగి చేస్తాయి.
సరైన నిద్ర లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో శరీరంలో కావాల్సిన శక్తి లేకపోవడం వల్ల అనవసరపు అనారోగ్యానికి గురవుతారు. ఫలితంగా రకరకాల ఇన్ఫెక్షన్లకు గురై వ్యాధుల భారీగా పడతారు. ఆహారంతో పాటు నిద్ర సక్రమంగా ఉండడం వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Also Read : భాగస్వామితో కలిసి నిద్రిస్తే ఇన్ని ప్రయోజనాలా.. ఇవి అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు..
రోజు సక్రమంగా నిద్ర లేకపోవడం వల్ల తీవ్రంగా ఆకలి వేస్తుంది. దీంతో ఇంట్లో వండిన ఆహారం తినాలని అనిపించదు. ఈ క్రమంలో బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ తినాలని అనుకుంటారు. అయితే జంక్ ఫుడ్ తినడం వల్ల ఎప్పటికైనా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇది అనవసరపు అనారోగ్యాలను తీసుకొచ్చి మానసికంగా ఆందోళన గురిచేస్తాయి.
నిద్ర లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి..హర్మోన్లపై ప్రభావం చూపుతుంది. దీంతో సంతాన లేమి కూడా ఉండే అవకాశం ఉంటుంది. సరైన నిద్ర లేక పోతే శరీరంపై ప్రభావం పడి శక్తిని కోల్పోతారు. దీంతో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కొనసాగితే శృంగారం పై ఆసక్తి తగ్గుతుంది. దీంతో దంపతుల మధ్య సంబంధాలు తెగిపోతాయి. అందువల్ల రోజు కనీసం 8 గంటల పాటు నిద్రపోయే ప్రయత్నం చేయాలి.
నిద్రలేమి కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. వీటిలో థైరాయిడ్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఇవి ఇతర రోగాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. నిద్రలేమి కారణంగా శరీరంపై అధిక ఒత్తిడి పెరిగే ఈ రకమైన వ్యాధులకు దారితీస్తుంది.
అందువల్ల ప్రతిరోజు తప్పనిసరి అయితే తప్ప అనవసరంగా నిద్రను పాడు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కనీసం 8 గంటల పాటు ప్రతిరోజు నిద్రపోవడం వల్లనే ఆరోగ్యంగా ఉంటారని పేర్కొంటున్నారు. సరైన నిద్ర పోవడంతో పాటు పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. మొబైల్తో ఎక్కువసేపు ఉండడం వల్ల కూడా నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల రాత్రి సమయంలో మొబైల్ ను దూరంగా ఉంచడమే మంచిది.
Also Read : బెడ్ ఎక్కిన వెంటనే నిద్ర రావాలంటే ఈ ఐదు టిప్స్ పాటించండి..