Water During Meals:రోజు ఆహారం తినేటప్పుడు చాలామంది గబగబా నీరు తాగుతూ ఉంటారు. కొందరు తక్కువ తింటూ ఎక్కువ నీరు తాగుతూ ఉంటారు. ఎక్కువ నీరు శరీరంలోకి వెళ్లడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని భావిస్తారు. కానీ భోజనం చేసే సమయంలో సరైన పద్ధతిలో నీరు తీసుకోవాలి. లేకుంటే తిన్న ఆహారం జీర్ణం కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అన్నం తినేటప్పుడు ఎన్ని తాగాలి? ఎన్ని తాగొద్దు? అనేవి నిర్ణయించుకోవాలి. అసలు భోజనం చేసేటప్పుడు నీరు ఎలా తీసుకోవాలి?
భోజనం ప్రారంభం అయిన తర్వాత అవసరం అయితేనే కొద్దిగా నీరు తీసుకోవాలి. ఎందుకంటే తీసుకున్న ఆహారం గొంతులో ఇరుక్కోకుండా కిందికి జారడానికి ఈ నీరు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆహారం జీర్ణం కావడానికి లూబ్రికేంట్ లాగా పని చేస్తుంది. ముఖ్యంగా కొందరు ప్రైడ్ వంటి ఆహారం తీసుకున్నప్పుడు వీటిని పలచపరచడానికి నీరు తప్పనిసరిగా తాగాలి. ఆహారం తీసుకునేటప్పుడు కొద్దిపాటి నీరు తీసుకుంటే కడుపులోని జీర్ణ రసాలు, పేగులోని ద్రవాలు జీర్ణవ్యవస్థకు తోడవుతాయి. భోజనం చేసేటప్పుడు ఎలాంటి నీరు తీసుకోకపోతే మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే భోజనం చేసేటప్పుడు ఎలాంటి నీరు తీసుకోవద్దని.. ఇలా తీసుకోవడం వల్ల కడుపులోని ఆమ్లం పల్చబడుతుందని అంటారు. కానీ దీనికి ఎటువంటి ఆధారాలు లేవు అని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జీర్ణవ్యవస్థకు తగినంత నీరు ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఈ నీరు ఎంత పరిమాణం ఉండాలి? అనేదానికి ప్రత్యేకంగా ఏమీ చెప్పరాదు. ఎందుకంటే వాతావరణం, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పరిస్థితిలో దృష్ట్యా కొందరు నీటిని ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా తరచూ గుండె, ఆహారం పైకి వచ్చినట్లు అనిపించడం, యాసిడ్ రిప్లెక్స్ లక్షణాలు ఉన్నవారు భోజనం మధ్యలో తప్పనిసరిగా నీరు తీసుకోవాలి.
అయితే కొందరు ఆహారం తీసుకునేటప్పుడు ఎక్కువ నీరు తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అయ్యే అవకాశం ఉండదు. కానీ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకు నీరు తీసుకుంటూ ఉండాలి. మొత్తం మీద శరీరానికి తగినంత నీరు అందిస్తూ ఉండాలి. లేకుంటే హైడ్రేషన్ సమస్యలు వచ్చి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.