Homeవింతలు-విశేషాలుCubbon Park: పార్క్ లో ఇద్దరు యువతులు చేసిన పని.. వైరల్ వీడియో

Cubbon Park: పార్క్ లో ఇద్దరు యువతులు చేసిన పని.. వైరల్ వీడియో

Cubbon Park: జనం భారీగా గుమి గూడారు. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాకపోతే ఆ ఇద్దరు కొట్టుకున్న తీరు చూస్తే ఇద్దరు మధ్య గట్టిగానే గొడవ జరిగి ఉంటుందని అందరూ అనుకున్నారు. కేవలం కొట్టుకోవడమే మాత్రమే కాదు.. బ్రహ్మాండంగా బూతులు తిట్టుకున్నారు. ఈ సంఘటన బెంగళూరు నగరంలోని కబ్బన్ పార్క్ ఏరియాలో చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు ఒకరినొకరు ఘోరంగా కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రాయలేని విధంగా బూతులు […]

Cubbon Park: జనం భారీగా గుమి గూడారు. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాకపోతే ఆ ఇద్దరు కొట్టుకున్న తీరు చూస్తే ఇద్దరు మధ్య గట్టిగానే గొడవ జరిగి ఉంటుందని అందరూ అనుకున్నారు. కేవలం కొట్టుకోవడమే మాత్రమే కాదు.. బ్రహ్మాండంగా బూతులు తిట్టుకున్నారు.

ఈ సంఘటన బెంగళూరు నగరంలోని కబ్బన్ పార్క్ ఏరియాలో చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు ఒకరినొకరు ఘోరంగా కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రాయలేని విధంగా బూతులు తిట్టుకున్నారు. అసలు వారిద్దరి మధ్య ఆ స్థాయిలో ఘర్షణ ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. ఇద్దరికీ ఏమైనా పాత పగలు ఉన్నాయా.. లేదా ఇంకా ఏవైనా సమస్యలా అని ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారిద్దరి గొడవను చూస్తున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ మాత్రం దానికి ఈ స్థాయిలో కొట్టుకుంటారా అని.. చర్చించుకున్నారు.

కబ్బన్ పార్క్ ఏరియాలో ఇద్దరు యువకులు రీల్స్ చేస్తున్నారు. రీల్ చేస్తున్న సమయంలో వారిద్దరి మధ్య చోటుచేసుకున్న గొడవ ఘర్షణకు దారి తీసింది. వారిద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఆ తర్వాత అవి పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి దిగజారాయి. ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారు. దారుణంగా తిట్టుకున్నారు. అంతేకాదు వాళ్లు కొట్టుకున్న తీర్పు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. జనాల మొత్తం వారిద్దరిని చూడటం మొదలుపెట్టారు. అయినప్పటికీ వారిద్దరు కొట్టుకునే విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. చాలాసేపటికి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న తర్వాత చివరికి శాంతించారు. వారిద్దరినీ కూల్ చేయడానికి. చుట్టుపక్కల వారు ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇద్దరు విపరీతంగా కొట్టుకున్న తర్వాత.. శరీరంలో శక్తి మొత్తం నశించిపోయిన తర్వాత.. చల్లబడ్డారు.

ఈ సంఘటన నేటి కాలంలో యువత తీరుకు దర్పణంగా నిలుస్తుంది. ఒకప్పుడు వీధి కుళాయిల దగ్గర ఆడవాళ్లు కొట్టుకునేవారు. ఆ తర్వాత చిన్న చిన్న విషయాలకు గొడవపడేవారు. ఇప్పుడు ఏకంగా రీల్స్ విషయంలో ఘర్షణ పడుతున్నారు. అది కూడా తీవ్రస్థాయిలో.. వచ్చే రోజుల్లో ఇటువంటి సంఘటనలు ఎన్ని చూడాలో.. సోషల్ మీడియా వల్ల మనిషి చివరికి వీధి పోరాటాలు చేసుకునే స్థాయికి దిగజారిపోయాడు. వచ్చే రోజుల్లో ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతాయని అప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాలో తెలియడం లేదని విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper