HMD Vibe 2 Pro : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వరుసగా కొత్త మోడళ్లను తీసుకొస్తున్న HMD.. తాజాగా మరో ఆసక్తికరమైన ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. HMD Vibe 2 Pro స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 29న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయాలు జరగనున్నాయి.
120Hz డిస్‌ప్లే
HMD Vibe 2 Proలో 6.78 అంగుళాల Full HD+ డిస్‌ప్లే అందించనున్నారు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో రానుంది. దీంతో వీడియోలు, గేమింగ్, స్క్రోలింగ్ వంటి వాటిలో స్మూత్ అనుభూతి లభించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Aqua Green, Cosmic Purple, Silver Mist అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.
Dimensity 6300 ప్రాసెసర్
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే HMD Vibe 2 Proలో MediaTek Dimensity 6300 చిప్‌సెట్ ఉంటుంది. దీనికి గరిష్ఠంగా 8GB RAM, 128GB స్టోరేజ్ జత చేయనున్నారు. ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానుంది. అలాగే HMD అందిస్తున్న Indus AI ఫీచర్‌కు కూడా ఇందులో మద్దతు ఉంటుంది. ఈ AI సిస్టమ్ 22 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.
64MP కెమెరా.. 6000mAh బ్యాటరీ
కెమెరా విభాగంలో HMD Vibe 2 Proకు వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64MP Sony IMX682 ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13MP ఫ్రంట్ కెమెరా అందించనున్నారు.
బ్యాటరీ విషయానికి వస్తే 6000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీనికి 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
Vibe సిరీస్‌లో రెండో ఫోన్
HMD Vibe 2 Pro.. భారత్‌లో Vibe సిరీస్‌లో కంపెనీ తీసుకొస్తున్న రెండో స్మార్ట్‌ఫోన్. ఈ ఏడాది మేలో HMD Vibe 2 5Gను రూ.10,999 ప్రారంభ ధరతో భారత్‌లో విడుదల చేసింది. ఆ ఫోన్‌లో 6.7 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 50MP మెయిన్ కెమెరా, 6000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
అయితే HMD Vibe 2 Pro ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. సెప్టెంబర్ 29న అధికారిక లాంచ్ సందర్భంగా ధర, పూర్తి వేరియంట్లు, ఆఫర్ల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.