Homeబిజినెస్ZENO 300: బడ్జెట్ ధరలో తోపు స్మార్ట్ ఫోన్ ఇది. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

ZENO 300: బడ్జెట్ ధరలో తోపు స్మార్ట్ ఫోన్ ఇది. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

ZENO 300: బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకునే వాళ్లకు.. ఫీచర్లు అధికంగా ఉండాలని కోరుకునే వాళ్లకు.. ఈ ఫోను తోపు. వాస్తవానికి నేటి స్మార్ట్ ఫోన్ కాలంలో చాలామంది ప్రీమియం మోడల్స్ మాత్రమే కాదు.. బడ్జెట్ మోడల్స్ కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అటువంటి వాళ్లకోసం ఈ ఫోన్ బెస్ట్ ఎంపిక అనవచ్చు. బడ్జెట్ లెవెల్ లో జెనో 300 మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర పదివేల లోపు ఉంది. […]

ZENO 300: బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకునే వాళ్లకు.. ఫీచర్లు అధికంగా ఉండాలని కోరుకునే వాళ్లకు.. ఈ ఫోను తోపు. వాస్తవానికి నేటి స్మార్ట్ ఫోన్ కాలంలో చాలామంది ప్రీమియం మోడల్స్ మాత్రమే కాదు.. బడ్జెట్ మోడల్స్ కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అటువంటి వాళ్లకోసం ఈ ఫోన్ బెస్ట్ ఎంపిక అనవచ్చు.

బడ్జెట్ లెవెల్ లో జెనో 300 మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర పదివేల లోపు ఉంది. దీని బ్యాటరీ లైఫ్ సమర్థవంతంగా ఉంది. నిర్మాణం కూడా పటిష్టంగా ఉంది. రోజువారి అవసరాలకు దీని పనితీరు అద్భుతంగా ఉంటుంది. దీని ధర 9649 రూపాయలుగా ఉంది. పైగా ఇది లావెండర్.. సిల్వర్ మిస్ట్, క్లాసిక్ బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ లో Octa core T7 100 processor ను అమర్చారు. ఇది 4 జి బి రామ్, 64 జీబీ మెమరీతో వస్తుంది. అదనంగా 8 జీబీ వర్చువల్ ర్యామ్ ను విస్తరించుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. మొత్తంగా 12 జిబి వరకు ఎఫెక్టివ్ ర్యామ్ ఇందులో లభిస్తుంది. డిజిటల్ పేమెంట్లు.. మెసేజింగ్.. మీడియా స్ట్రీమింగ్ వంటి ప్రైమరీ యాప్స్ స్మూత్ గా రన్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 గో అనే ఎడిషన్ మీద ఆధారపడి పనిచేస్తుంది.. అంతేకాదు ఎంట్రీ లెవెల్ హార్డ్వేర్ మీద మెమొరీ వినియోగాన్ని పూర్తిస్థాయిలో ఆప్టిమైజ్ చేస్తుంది.

ఫోన్ ముందు భాగంలో 90 హెచ్ జెడ్ రీ ఫ్రెష్ రేట్, 6.56 అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇందులో ఉంది. సెల్ఫీల కోసం వాటర్ డ్రాప్ నాచ్ లో ఫైన్ మెగాపిక్సన్ ఫ్రంట్ కెమెరా.. వెనకవైపు 8 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఏర్పాటు చేశారు. డిటిఎస్ సౌండ్ ప్రాసెసింగ్, 3.5 బిల్లీ మీటర్ ఆడియో జాగ్ ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ లో బ్యాటరీ గొప్పగా ఉంది..18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన భారీ 6,000 mAh బ్యాటరీ ఉంది.

ఈ ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత ఆ తేదీ నుంచి వంద రోజులపాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ పాలసీ ఈ కంపెనీ అందిస్తుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్.. ఫేస్ అన్లాక్ వంటి వ్యవస్థలు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 4జి.. వైఫై.. బ్లూటూత్.. జిపిఎస్.. యు ఎస్ బి టైప్ సి.. ఐ ఆర్ బ్లాస్టర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper