Mivi One 5G: నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ల విపరీతంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు వేగంగా మారిపోవడం.. యుద్దాల వంటివి చోటు చేసుకోవడం వల్ల ఫోన్ల ధరలు పెరిగిపోతున్నాయి. చిప్ సెట్ ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఫోన్లు ఆకాశమార్గంలో విహరిస్తున్నాయి.
ఇలాంటి క్రమంలో మార్కెట్లో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రముఖ వేరియబుల్ బ్రాండ్ మివి కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. Mivi One 5G పేరుతో కొత్త మోడల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ఉంది. ఆకట్టుకునే స్థాయిలో రంగులలో ఈ బ్రాండ్ ఫోన్ ను Mivi కంపెనీ అందుబాటులో తీసుకొచ్చింది. ఇందులో మివీ కేర్, సర్వీస్ కూడా ఉచితంగా లభిస్తాయి. దీనికి పోటీగా మరో వేరే బుల్ కంపెనీ ఫైర్ బోల్ట్ బోల్ట్ ఏ ఎస్ 5 జీ అనే ఫోన్ ను అందుబాటులో తీసుకొచ్చింది.
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే
ఇందులో 6.75 అంగుళాల హెచ్ డీ+ తో కూడిన ఐపీఎస్ ఎల్ సి డి డిస్ప్లే ఉంది. 90 హెచ్ జడ్ రీ ఫ్రెష్ రేట్ ఇచ్చారు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ ప్రాసెసర్ తో ఇది పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 పై ఇది పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనక సాంసంగ్ ISOCELL 50 మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరా ఇందులో ఏర్పాటు చేశారు. ముందువైపు 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. 6,000 mAh బ్యాటరీ, 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు ఫోన్ తో పాటు అడాప్టర్ ను కంపెనీ ఇచ్చింది. రెండు సంవత్సరాల పాటు ఓఎస్ అప్డేట్లు ఇస్తుంది
కేర్, సర్వీస్ ఉచితం
మిని వన్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు మినీ కేర్, సర్వీస్ ఫెసిలిటీ కల్పిస్తోంది. కస్టమర్లు కేవలం ఇంటి నుంచే సర్వీస్ పొందడానికి అవకాశం ఉంది. ఫోన్ వాతున్నప్పుడు ఏదైనా సమస్య ఎదురైతే.. కంపెనీ నిర్వాహకులు కస్టమర్ ఫోన్ పికప్ చేసుకుంటారు. రిపేర్ చేస్తారు.. ఆ తర్వాత కస్టమర్ పంపిస్తారు. ఒకవేళ గనుక ఏడు రోజుల వ్యవధిలో ఫోన్ రిపేర్ కాకపోతే కొత్త ఫోన్ ను కంపెనీస్తోంది. ఇక ఈ సంస్థకు దాదాపు 500 వరకు సర్వీస్ సెంటర్లు ఉన్నాయి.
ఈ ఫోన్ ను కంపెనీ మూడు వేరియంట్ల లో తీసుకొస్తున్నది. 4 జీబీ+ 128 జీబీ వేరియంట్ ధర 12,999, 6జీబీ+ 128 జీబీ ధర 14,999, 8 జీబీ+ 128 జీబీ ధర 16,499 గా Mivi కంపెనీ ప్రకటించింది. ఆఫర్లలో భాగంగా యాక్సిస్..హెచ్ డీ ఎఫ్ సీ, ఐసిఐసిఐ, ఎస్ బీ ఐ క్రెడిట్ కార్డుల ద్వారా 1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు