Kiara Advani Bodyguard : పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు కియారా అద్వానీ. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో ఈమెకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. సాధారణంగా పెళ్లి అయ్యాక ఏ హీరోయిన్ కి అయినా అందం తగ్గడం సహజం. ఆ కారణం చేత నెమ్మదిగా సినిమా అవకాశాలు కూడా తగ్గుతూ వస్తాయి. ఎంతోమంది హీరోయిన్స్ విషయం లో ఇది మనం చూశాము. కానీ కియారా అద్వానీ మాత్రం ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా చెక్కు చెదరని అందం తో కనిపిస్తోంది. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’ ఈ నెల 26 న ప్రపంచవ్యాప్తంగా పాన్ వరల్డ్ స్థాయిలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా , ప్రొమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్ లో హీరో యాష్ కియారా అద్వానీ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘కియారా అద్వానీ చాలా క్రమశిక్షణ , నిబద్దత గల అమ్మాయి. ఆమె గర్భం దాల్చినప్పటికీ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేది. నేను ఆమె విషయం లో కొంచెం ఆందోళన గానే ఉండేవాడిని. ఎందుకంటే ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కఠినంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక సందర్భం చెప్తాను. ఈ చిత్రం లో వర్షం లో తడిచే ఒక సన్నివేశం ఉంటుంది. ఇది చాలా సులభంగా పూర్తి చేయగలమని అనుకున్నాము. కానీ దానికి చాలా సమయం పట్టింది. ఎక్కువసేపు వర్షం లో తడుస్తూనే కియారా షూటింగ్ చేసింది. నాతో పాటు డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కూడా కియారా విషయం లో చాలా టెన్షన్ పడేది. ఆమె సెట్స్ లో ఉన్నంత సేపు మేమిద్దరం బౌన్సర్లు , బాడీ గార్డులు లెక్క మారి జాగ్రత్తలు తీసుకున్నాం. సినిమా విడుదల తర్వాత ఆమె పడిన కష్టం ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. దానికి తగ్గ పేరు కూడా వస్తుంది. ఈ సినిమా ఆమె కెరీర్ లో ఒక ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని కచ్చితంగా చెప్పగలను’ అంటూ చెప్పుకొచ్చాడు యాష్.
అలా కియారా అద్వానీ కి బాడీ గార్డ్ గా పని చేసిన ఏకైక హీరో గా యాష్ నిల్చిపోయాడు. ఇప్పటికే ‘తబాహీ’ పాటలో కియారా అద్వానీ , యాష్ మధ్య ఘాటు రొమాన్స్ ని మనమంతా చూశాము. యూత్ ఆడియన్స్ ఈ రొమాన్స్ ని ఎంజాయ్ చేస్తే, మరికొంతమంది పెళ్లి తర్వాత ఇలాంటి పాటల్లో నటించడం ఏంటి అంటూ విమర్శించారు. ఇక రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ లో కూడా కియారా అద్వానీ నట విశ్వరూపం చూపించింది. ఇందులో ఆమె పాత్ర పాజిటివ్ గానూ , నెగెటివ్ గానూ ఉండబోతుందని టాక్. చూడాలి మరి విడుదల తర్వాత యాష్ చెప్పినట్టుగానే కియారా అద్వానీ కి మంచి పేరు వస్తుందా లేదా అనేది.