Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna : రష్మికకు ఏమైంది.. పెళ్లి అయ్యాక ఆమె నుండి ఇలాంటి పోస్ట్ అసలు...

Rashmika Mandanna : రష్మికకు ఏమైంది.. పెళ్లి అయ్యాక ఆమె నుండి ఇలాంటి పోస్ట్ అసలు ఊహించలేదు..

Rashmika Mandanna : పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతూ మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్ ఎవరూ అంటే , మన అందరికీ టక్కుమని గుర్తుకువచ్చే పేరు రష్మిక మందాన. కన్నడ సినీ పరిశ్రమ ద్వారా వెండితెర కి పరిచయమై , తెలుగు సినిమాలతో క్రేజ్ ని సంపాదించుకొని , నేడు బాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరిగా రష్మిక కొనసాగుతోంది. ఒక పక్క […]

Rashmika Mandanna : పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతూ మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్ ఎవరూ అంటే , మన అందరికీ టక్కుమని గుర్తుకువచ్చే పేరు రష్మిక మందాన. కన్నడ సినీ పరిశ్రమ ద్వారా వెండితెర కి పరిచయమై , తెలుగు సినిమాలతో క్రేజ్ ని సంపాదించుకొని , నేడు బాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరిగా రష్మిక కొనసాగుతోంది. ఒక పక్క ‘గర్ల్ ఫ్రెండ్’, ‘మైసా’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే , మరోపక్క హీరోయిన్ రోల్స్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రష్మిక కి రీసెంట్ గానే షూటింగ్ లో తీవ్రమైన గాయాలై విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఆమె మాట్లాడుతూ ‘ఇన్ని రోజులు క్షణం తీరిక లేకుండా గడిపేసరికి , ఒక్కసారిగా నాకు విశ్రాంతి అనేది భయంగా అనిపిస్తోంది. ఇక తప్పనిసరి పరిస్థితిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు , బిజీ గా గడిపే పాత రోజులను గుర్తు చేసుకున్నా భయం వేస్తోంది. బహుశా జీవితమంటే ఇంతేనేమో’ అంటూ రష్మిక మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఎప్పుడూ చలాకీగా అభిమానులను పలకరించే రష్మిక ఒక్కసారిగా ఇలా ఫిలాసఫీ లు చెప్తుండడం చూసి , అసలు రష్మిక కి ఏమైంది?, ఆమె నుండి ఇలాంటి పోస్టులు చూస్తుంటే చాలా తేడాగా ఉందే అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ని పెళ్లి చేసుకున్న తర్వాత మొదటిసారి ఆమె ఇలా గాయాలపాలైంది. దీంతో సోషల్ మీడియా లోని ఆమె అభిమానులు , విశ్రాంతి సమయం లో విజయ్ దేవరకొండ మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడా లేదా అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం రష్మిక చేతుల్లో ‘రణబలి’, ‘మైసా’, ‘రాకా’ వంటి చిత్రాలు ఉన్నాయి. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల తర్వాత , రష్మిక తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి చేస్తున్న చిత్రం ‘రణబలి’. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక గిరిజన యువతిగా ఆమె చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మైసా’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ , గ్లింప్స్ వీడియో లకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్. ఇక ‘పుష్ప’ సిరీస్ తర్వాత అల్లు అర్జున్ తో కలిసి ఆమె చేస్తున్న మూడవ చిత్రం ‘రాకా’. అట్లీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక విలన్ క్యారెక్టర్ లో కనిపించనుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper