SS Rajamouli: తెలుగు చలన చిత్రం పరిశ్రమలో నేడు రాజమౌళి ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం అతని టాలెంట్ అనేది వాస్తవమే. కానీ ఆ టాలెంట్ కి నిత్యం అండగా నిలుస్తూ వచ్చింది ఆయన కుటుంబం. మొదటి సినిమా నుండి వారణాసి వరకు, తన కుటుంబం తో కలిసే ఆయన పని చేస్తూ వచ్చాడు. ఆయన కుటుంబం లో సతీమణి రమా రాజమౌళి ఇచ్చే సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కాస్టూమ్ డిజైనర్ గా మాత్రమే కాకుండా, రాజమౌళి తీసుకునే ప్రతీ నిర్ణయం లోనూ రమా రాజమౌళి తోడ్పాటు ఉంటుంది. అలా భార్యభర్తలు మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో కొనసాగడం వల్లే నేడు ఈ స్థానంలో లో ఉన్నారు.
ఇదంతా పక్కన పెడితే రమ కి రాజమౌళి మొదటి భర్త కాదు అనే విషయం మీకు తెలుసా?. అంతే కాదు రమ రాజమౌళి కంటే ఏకంగా 4 ఏళ్ళు పెద్దది అట. ప్రస్తుతం రాజమౌళి కొడుకు గా చాలామణి అవుతున్న కార్తికేయ కూడా మొదటి భర్త కొడుకు అట. అయినప్పటికీ తన సొంత కొడుకు లాగా ట్రీట్ చేస్తూ వచ్చి నేడు ఇండస్ట్రీ లో కార్తికేయ కి సముచితమైన స్థానాన్ని కల్పించాడు. అయితే రమ మొదటి భర్త ఎవరు?, అతను ఇండస్ట్రీ కి సంబంధించిన వాడేనా?, లేదా బయటవాడా?,ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. కానీ అతనితో వైవహిక జీవితంలో రమ కి చాలా కష్టాలు అనుభవించింది అని, అందుకే తట్టుకోలేక అతనితో విడిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే మాట.
అంతే కాదు పెళ్లి తర్వాత వీళ్లిద్దరు కలిసి బిడ్డకు జన్మని ఇవ్వలేదు. కేవలం ఒకరి కోసం ఒకరు ప్రేమగా ఉంటూ, తమ కెరీర్స్ ని బిల్డ్ చేసుకున్నారు. అన్నోన్య దాంపత్యం అంటే ఇదే. ఇక వారణాసి విషయానికి వస్తే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మన టాలీవుడ్ నుండి రాబోతున్న మొట్టమొదటి ఇంటర్నేషనల్ సినిమా కావడం తో అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.