Homeక్రైమ్‌Delhi Noodles Deaths: నూడుల్స్ తింటే చనిపోతారా.. ఐదుగురి ప్రాణాలు గాలిలో.. ఏం జరిగిందంటే..

Delhi Noodles Deaths: నూడుల్స్ తింటే చనిపోతారా.. ఐదుగురి ప్రాణాలు గాలిలో.. ఏం జరిగిందంటే..

Delhi Noodles Deaths: మనం సాధారణంగా సాయంత్రం వేళలో అప్పుడప్పుడు నూడుల్స్ తింటాం. వాస్తవానికి ఇది చైనా ఫుడ్ అయినప్పటికీ.. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మనదేశంలో కూడా చాలామంది తింటున్నారు. ఇది ఫాస్ట్ ఫుడ్. నోటికి రుచిని తప్ప, శరీరానికి ఎటువంటి శక్తిని ఇవ్వదు.. కాకపోతే రుచికరంగా ఉంటుంది కాబట్టి.. జనం తింటూ ఉంటారు . నూడుల్స్ లో ఎగ్.. చికెన్.. ఇంకా రకరకాల వెరైటీలు లభిస్తుంటాయి. ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టుగా వాటిని తింటూ ఉంటారు. నూడుల్స్ […]

Delhi Noodles Deaths: మనం సాధారణంగా సాయంత్రం వేళలో అప్పుడప్పుడు నూడుల్స్ తింటాం. వాస్తవానికి ఇది చైనా ఫుడ్ అయినప్పటికీ.. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మనదేశంలో కూడా చాలామంది తింటున్నారు. ఇది ఫాస్ట్ ఫుడ్. నోటికి రుచిని తప్ప, శరీరానికి ఎటువంటి శక్తిని ఇవ్వదు.. కాకపోతే రుచికరంగా ఉంటుంది కాబట్టి.. జనం తింటూ ఉంటారు . నూడుల్స్ లో ఎగ్.. చికెన్.. ఇంకా రకరకాల వెరైటీలు లభిస్తుంటాయి. ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టుగా వాటిని తింటూ ఉంటారు.

నూడుల్స్ తింటే శరీరానికి శక్తి రాదని ముందుగానే చెప్పాం కదా.. ఒకవేళ వాటిని తింటే ప్రాణాలు పోతాయా.. అలాంటి అవకాశం ఏమైనా ఉందా.. దీనికి ఢిల్లీలో జరిగిన సంఘటన అవును అనే సమాధానం చెబుతోంది.. ఢిల్లీ నగరంలో నూడుల్స్ తిన్న కుటుంబంలో ఐదుగురు చనిపోయారు. ఇందులో ముగ్గురు చిన్నారలు ఉన్నారు. ఒకే ఒక రాత్రి.. ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రాత్రి భోజనంగా నోడుస్తున్న కుటుంబం తెల్లారేసరికి మిగతా జీవులుగా మారింది. మృతుల్లో భార్యాభర్తలతో పాటు ముగ్గురు చిన్నారులు ఉండడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. అసలు ఈ మరణాలకు నూడుల్స్ కారణమా.. కల్చర్ ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్ ఏమైనా జరిగిందా.. ఇంకా ఏదైనా కారణం ఉందా.. ఇప్పుడు ఈ అంశాలు కీలకంగా మారాయి..

ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోవిడా ప్రాంతం రబూపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా శ్రీపాదం గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి సంబంధించిన ఐదుగురు శనివారం ఉదయం తన ఇంట్లో విగత జీవులుగా కనిపించారు. చనిపోయిన వారిలో దంపతులతో పాటు.. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులు వివరించిన వివరాల ప్రకారం మహేష్ (37), అతడి భార్య లలిత (35), పిల్లలు లడ్డు (11), మిస్టి (7), సాక్షాత్ (3) మృతిచెందారు.. వీరంతా కూడా శుక్రవారం రాత్రి నూడుల్స్ తిన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అదే రోజు రాత్రి నిద్ర పోయారు మరుసటి రోజు ఉదయం విగత జీవులుగా కనిపించారు.

ఓకే కుటుంబంలో ఐదుగురు చనిపోవడం అనేక అనుమానాలకు కారణమవుతోంది. నూడిల్స్ తిన్న తర్వాత మరణాలు సంభవించడంతో ఫుడ్ పాయిజన్ జరిగి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఉన్నతాధికారులు, వైద్య సిబ్బంది, ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా పరిశీలనలు నిర్వహించింది. ఆధారాల సేకరించింది . మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పరీక్షల కోసం తరలించారు అయితే నూడిల్స్ లో ఏదైనా విష పదార్థం కలిసిందా? ఆహారం కలుషితమైందా? ఇంకా ఏదైనా కారణం ఉందా. ఈ ప్రశ్నలపై స్పష్టత రావాల్సి ఉంది

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper