Ranabaali Movie: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రణబాలి ‘ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ విజయ్ దేవరకొండ క్రేజ్ కారణంగా ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లోనూ బంపర్ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 8 నుండి 10 వేలకు మధ్యలో టికెట్లు అమ్ముడుపోతున్నాయి. మీడియం రేంజ్ సినిమాల్లో ఒక హైప్ లేని సినిమాకు ఫ్లాప్ టాక్ మీద ఈ స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోవడం అనేది సాధారణమైన విషయం కాదని , విజయ్ దేవరకొండ కి తప్ప , మరో యంగ్ హీరో కి ఇది సాధ్యం కాదని అంటున్నారు నెటిజెన్స్. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా డైరెక్టర్ రాహుల్ సంక్రుత్యాన్ ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ తో చెయ్యాలని అనుకోలేదట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చెయ్యాలని అనుకున్నాడట. కానీ ఇలాంటి డ్రామా సినిమాలకు ఈమధ్య కాలం లో క్రేజ్ బాగా తగ్గిన విషయాన్ని గమనించిన రామ్ చరణ్, ఎందుకో ఈ సినిమా వర్కౌట్ అవ్వదని అనిపించడం తో రిజెక్ట్ చేసాడని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ చేసుంటే రామ్ చరణ్ కెరీర్ లో పెద్ద ఫ్లాప్ గా మిగిలేదని అంటున్నారు నెటిజెన్స్. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ చేసిన వినయ విధేయ రామ, గేమ్ చేంజర్ , ఆచార్య చిత్రాలు దారుణమైన ఫ్లాప్స్ గా నిలిచాయి. #RRR ఒక్కటే సూపర్ హిట్ గా నిల్చింది. పెద్ది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎబోవ్ యావరేజ్ గ్రాసర్ గా నిల్చింది.
గడిచిన 7 ఏళ్ళ నుండి ఎక్కువ శాతం ఫ్లాప్స్ తో పాటు ‘రణబాలి ‘ కూడా చేసుంటే రామ్ చరణ్ కెరీర్ కి చాలా పెద్ద డ్యామేజ్ జరిగేదని , ఆ డ్యామేజ్ నుండి తప్పించుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. అయితే రామ్ చరణ్ చేసుంటే ఫలితం కాస్త మెరుగ్గా ఉండేదని మరికొందరి వాదన. ఎందుకంటే రామ్ చరణ్ ఆ గెటప్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేవాడని, విజయ్ దేవరకొండ కి ఆ గెటప్ సూట్ అవ్వలేదని , అందుకే సినిమాకు ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదని అంటున్నారు.