Anil Ravipudi: కమర్షియల్ సినిమాలను తీయడం అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. 200 సినిమాలు రిలీజ్ అయితే అందులో 150 సినిమాలు కమర్షియల్ సినిమాలే ఉంటాయి. కాబట్టి వాటిని పక్కన పెడుతూ బెస్ట్ కమర్షియల్ సినిమా తీయడం అనేది చాలా పెద్ద టాస్క్… దానిని పర్ఫెక్ట్ గా పోట్రే చేయగలిగితే మాత్రం సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. ఇక కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలపడం లో పేరు సంపాదించుకున్న వాళ్ళలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటే అతని తర్వాత స్థానంలో అనిల్ రావిపూడి ఉండటం విశేషం… అనిల్ ఇప్పటి వరకు 9 సినిమాలను చేస్తే ఆ 9 మూవీస్ తో సూపర్ సక్సెస్ లను సాధించాడు. అతను కమర్షియల్ ఫార్మాట్ ని పూర్తిగా ఫాలో అవుతూ ఎక్కడా కూడా సినిమా నుంచి డివియెట్ అవ్వకుండా ప్రతి సీన్లో తన మార్క్ చూపిస్తాడు. సినీ చూసే ప్రతి ప్రేక్షకుడిని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తు సినిమాను ముందుకు తీసుకెళ్తుంటాడు. అందువల్లే ఆయన సినిమాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబడుతున్నాయి.
అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అందుకే అతనితో సినిమాలు చేయడానికి హీరోలు, ప్రొడ్యూసర్లు సైతం ఆసక్తి చూపిస్తుండటం విశేషం… ఈ సంవత్సరం ఇప్పటికే చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సక్సెస్ ని సాధించాడు. ఇక ఇదిలా ఉంటే అనిల్ ఇప్పటివరకు కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్స్ ను మాత్రమే చేశాడు.
కానీ ఇప్పుడు ఆయన నుంచి ఒక సీరియస్ సినిమా వస్తే చూడడానికి అతని అభిమానులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి సినిమాలు చేయగలిగే కెపాసిటి అనిల్ రావిపూడి కి ఉందా లేదంటే రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలలోనే సినిమాలు చేయగలుగుతాడా అంటూ కొంతమంది సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి మీద కొన్ని విమర్శలైతే చేస్తున్నారు…
దానిని ఛాలెంజింగ్ గా తీసుకొని అనిల్ రాబోయే సినిమాల్లో దానిని అప్లై చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి చేస్తున్న ‘జనవరి 12 విడుదల’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…