TVS EV scooters: ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాటా అంతగా ఉండేది కాదు. కానీ కొంత కాలం నుంచి ఈ సెగ్మెంట్లో విక్రయాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా వెస్ట్రన్ దేశాల కంపెనీలను ఇండియన్ కంపెనీలు ఓవర్ టేక్ చేస్తున్నాయి.
ఈవీ స్కూటర్ మార్కెట్లో మొన్నటిదాకా ఓలా కంపెనీకి తిరుగులేదు. అయితే ఈ కంపెనీకి ఇప్పుడు టీవీఎస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ముఖ్యంగా పండగల సీజన్ సమయంలో బుకింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఈసారి ఓలాని మించిపోయింది టీవీఎస్. ఏకంగా నెంబర్ వన్ స్థానానికి వచ్చేసింది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటివరకు ఎలక్ట్రిక్ టూవీలర్ విక్రయాలలో ఓలా కంటే టీవీఎస్ ముందు స్థానంలోకి వచ్చేసింది.
ఓ నివేదిక ప్రకారం గత నెల ఆగస్టు 24 నాటికి టీవీఎస్ కంపెనీ మొత్తం 11 లక్షల 25 వేల 873 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. ఓలా కంపెనీ 11 లక్షల 17వేల 031 వద్ద మాత్రమే ఆగిపోయింది. ఓలా కంపెనీతో పోటీ చూస్తే టీవీఎస్ కంపెనీ ఏకంగా 10,482 యూనిట్లు ఎక్కువగా అమ్మింది. గత నెల మొదటి 24 రోజుల్లో టీవీఎస్ 35 వేల 304 ఈ టూ వీలర్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసింది. ఈ జాబితాలో ఓలా కేవలం 8466 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగింది. క్రితం నెలలో టీవీఎస్ కూడా రికార్డు స్థాయిలో 52 108 ఈ స్కూటర్లను టీవీఎస్ కంపెనీ అమ్మింది. మార్కెట్లో టీవీఎస్ తిరుగులేని స్థాయిని ఆదుకోవడంతో ఓలా డీలా పడిపోయింది. ఇక కస్టమర్లు కోరుకునే రంగులు ఉండడం.. ఫీచర్లు.. ఇతర సదుపాయాలు ఎక్కువగా ఉండటంతో చాలామంది టీవీఎస్ కంపెనీకి జై కొడుతున్నారు. రిజిస్ట్రేషన్ నుంచి మొదలుపెడితే నచ్చిన రంగుల్లో డిజైన్లు ఉండడం.. డెలివరీ కూడా వేగంగా జరిగిపోతున్న నేపథ్యంలో చాలామంది టీవీఎస్ కంపెనీకి జై కొడుతున్నారు.
టీవీఎస్ కంపెనీ ఐ క్యూబ్ పేరుతో ఈ స్కూటర్లను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కంపెనీకి బలమైన డీలర్షిప్ నెట్వర్క్ ఉంది. ఇక ఈ ఏడాది మధ్య నుంచి ఓలా కంపెనీకి సంబంధించి విక్రయాలు చాలావరకు తగ్గిపోయాయి. కేరళలో ప్రధాన పండుగ అయిన ఓనం సేల్స్ జోరు చూపించక ముందే టీవీఎస్ ఈ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఈ నెలలో బజాజ్.. ఏథర్ అనే సంస్థలు కొత్త వేరియంట్లను.. ప్రత్యేకమైన ఆఫర్లను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందువల్లే సాధ్యమైనంతవరకు స్కూటర్ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ప్రతిరోజు మార్కెట్ అప్డేట్స్ గమనిస్తూ ఉండాలి. అప్పుడే వారు ఖర్చుపెట్టిన డబ్బులకు జస్టిఫికేషన్ లభిస్తుంది.