Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో పాటు , మూవీ లవర్స్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘వారణాసి’. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ విజువల్ వండర్ షూటింగ్ ఇప్పటికే 80 శాతం కి పైగా పూర్తి అయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి , వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ఎట్టి పరిస్థితిలోనూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ లెవెల్ లో అన్ని ఫారిన్ భాషల్లోనూ విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కి ఎలాగో అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్ వస్తుంది , ఇక పై ఆయన టాప్ మోస్ట్ పాన్ ఇండియన్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తాడని అభిమానులతో పాటు , అంతా ఊహించారు.
కానీ మహేష్ బాబు తదుపరి చిత్రం అందరి అంచనాలను తలక్రిందులు చేసేలా ఉంది. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. స్వయంగా మహేష్ బాబు అనిల్ రావిపూడి ని సంప్రదించి మంచి స్క్రిప్ట్ ని రెడీ చేయమని చెప్పాడట. ప్రస్తుతం వెంకటేష్ , కళ్యాణ్ రామ్ లతో ‘జనవరి 12 విడుదల’ సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి , ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు మూవీ కి సంబంధించిన స్టోరీ ని రెడీ చేయబోతున్నాడు. ఈ వార్త మహేష్ బాబు అభిమానులకు కాస్త నిరాశ కలిగించేది అని చెప్పొచ్చు. ఎందుకంటే ‘వారణాసి’ తర్వాత వాళ్ళు సందీప్ వంగ , ప్రశాంత్ నీల్ రేంజ్ డైరెక్టర్స్ తో మహేష్ సినిమాలు ఊహించుకున్నారు.
కానీ ఒక రీజనల్ డైరెక్టర్ తో చేయబోతున్నాడని కలలో కూడా ఊహించలేదు. అనిల్ రావిపూడి తక్కువ ఏమి కాదు. వరుసగా రెండు రీజనల్ ఇండస్ట్రీ హిట్స్ ని అందించాడు. మన ఇండస్ట్రీ లో రాజమౌళి తర్వాత ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ అంటే అనిల్ రావిపూడి నే. కానీ మహేష్ రేంజ్ పాన్ వరల్డ్ కి ఎగబాకిన తర్వాత మళ్లీ రీజనల్ సినిమా చేయాల్సి వస్తుందనే మహేష్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. ఎందుకంటే మహేష్ తోటి హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలే చేస్తున్నారు. వాళ్ళ మార్కెట్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరింది. మహేష్ కూడా అలా అవుతాడని అనుకుంటే , మళ్లీ పాత పద్దతిలోనే వెళ్తున్నాడని అంటున్నారు ఫ్యాన్స్.