Homeఎంటర్టైన్మెంట్Sarigamapa: 'సరిగమప' సరికొత్త సీజన్ లో సుడిగాలి సుధీర్ కి పోటీగా మరో టాప్ కమెడియన్.....

Sarigamapa: ‘సరిగమప’ సరికొత్త సీజన్ లో సుడిగాలి సుధీర్ కి పోటీగా మరో టాప్ కమెడియన్.. వీడియో వైరల్..

Sarigamapa: ‘జీ తెలుగు’ ఛానల్ లో అత్యంత ప్రజాధారణ పొందిన ‘డ్రామా జూనియర్స్ 9’ ప్రోగ్రాం చాలా తొందరగా ముగియడం తో ప్రేక్షకులు చాలా నిరాశకు గురయ్యారు. అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నప్పటికీ , ఎందుకు ఈ షో ని ఇంత తొందరగా ముగించారో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ జీ తెలుగు ఛానల్ వాళ్ళను ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. సుడిగాలి సుధీర్ , అనిల్ రావిపూడి కలిసి చేసే కామెడీ ని […]

Sarigamapa: ‘జీ తెలుగు’ ఛానల్ లో అత్యంత ప్రజాధారణ పొందిన ‘డ్రామా జూనియర్స్ 9’ ప్రోగ్రాం చాలా తొందరగా ముగియడం తో ప్రేక్షకులు చాలా నిరాశకు గురయ్యారు. అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నప్పటికీ , ఎందుకు ఈ షో ని ఇంత తొందరగా ముగించారో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ జీ తెలుగు ఛానల్ వాళ్ళను ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. సుడిగాలి సుధీర్ , అనిల్ రావిపూడి కలిసి చేసే కామెడీ ని బాగా మిస్ అవుతున్నాం, మళ్లీ వీళ్ళ కాంబినేషన్ ని చూసేది ఎప్పుడో అంటూ నిరాశ వ్యక్తం చేశారు. అలా నిరాశకు గురైన ఆడియన్స్ కి ఇప్పుడొక శుభ వార్త. ఈ ఆదివారం రాత్రి 9 గంటల నుండి ‘సరిగమప ‘ సరికొత్త సీజన్ ప్రారంభం కానుంది. గతం లో ప్రసారమైన సీజన్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ సీజన్ లో సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా , అనిల్ రావిపూడి , ఎస్పీ శైలజ , అనంత్ శ్రీరామ్ జడ్జీలుగా వ్యవహరించబోతున్నారు. మరోసారి అనిల్ రావిపూడి , సుడిగాలి సుధీర్ కాంబినేషన్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని చూడబోతున్నాము అన్నమాట. వీళ్లకు అనంత్ శ్రీరామ్ తోడయ్యాడు. ఈ ముగ్గురు కలిసి గత సీజన్ లో ఏ రేంజ్ కామెడీ ని పండించారో మనమంతా చూసాము. మరోసారి వీళ్ళ సందడి ని ఎంజాయ్ చేయబోతున్నాము. ఇదంతా పక్కన పెడితే గత సీజన్ లో ‘యాదమ్మ రాజు’ స్పెషల్ స్కిట్స్ ఈ షోలో ఉండేవి. కానీ ఈ సీజన్ లో ‘యాదమ్మ రాజు’ కి బదులుగా , ఇమ్మానుయేల్ కనిపించబోతున్నాడు. ‘జబర్దస్త్’ లో కమెడియన్ గా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న ఇమ్మానుయేల్ కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

గత బిగ్ బాస్ సీజన్ లో ఆయన కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. ఆ సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఇమ్మానుయేల్ కూడా ఒకడు. ఈయన కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు పొట్టచెక్కలు అయ్యేలా నవ్వుకున్నారు. అలాంటి ఇమ్మానుయేల్ , కామెడీ కింగ్ సుడిగాలి సుధీర్ తో కలిస్తే ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించగలమా?, మరో టాప్ టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకోబోతున్న షోగా ‘సరిగమప’ లేటెస్ట్ సీజన్ నిలవబోతుంది. అయితే ఈ సీజన్ అయినా ఎక్కువ రోజులు ఉంటుందా?, లేదా చిన్న సీజన్ గా మిగలబోతుందా అనేది చూడాలి. ఇకపోతే మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ ప్రోమో పై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper