మోటో జీ మ్యాక్స్ ఫోన్ లో 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డి ప్లస్ డిస్ ప్లే ఉండనుంది. ఇది ఎల్ సీడీ ప్యానెల్ ను కలిగి ఉన్నా.. రిజల్యూషన్ మాత్రంలో ఏమాత్రం తక్కువ లేదు. 120 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ తో పనిచేసే ఈ ఫోన్ లో రీల్స్ లేదా సినిమాలు చూసినప్పుడు కళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే స్పష్టమైన రంగులు ఇందులో ఆశించవచ్చు. ఇందులో స్నాప్ డ్రాగన్ 6 ఎస్ జెన్ 4 ప్రాసెసర్ ను వాడుతున్నారు. 6 జీబీ ర్యామ్ తో పాటు 128 జీబీ స్టోరేజ్ ఉండడంతో వేగంగా పనిచేసేవారికి అనుగుణంగా ఉంటుంది.
ఆండ్రాయిట్ 16 ఆధారిత సాఫ్ట్ వేర్ తో పనిచేసే ఈ మొబైల్ లో 50 మెగా పిక్సెల్ కెమెరా ను ఉంచారు. 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ తో పాటు 32 మెగా పిక్సెల్ తో కూడిన ఫ్రంట్ కెమెరా పనిచేస్తుంది. ఈ కెమెరాను ఎల్ వై టీ 600 సెన్సార్ తో పనిచేస్తుంది. దూరంగా ఉండే చిత్రాలతో పాటు సెల్ఫీల కోసం అద్భుతంగా ఈ కెమెరా పని చేస్తుంది.
ఈ కొత్త ఫోన్ లో బ్యాటరీ 7,000 ఏంఏహెచ్ కెపాసిటీ ఉండనుంది. ఈ బ్యాటరీ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది. అదనంగా దీనిని చార్జింగ్ అడాప్టర్ ఇవ్వనున్నారు. ఒక్కసారి బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే రెండు రోజుల పాటు నిరంతరంగా వాడుకోవచ్చు. ఈ ఫోన్ ఛార్జింగ్ 30 నిమిషాల్లో 65 శాతం ఛార్జింగ్ అవుతుంది.
మోటా జీ మ్యాక్స్ ఫోన్ భారత్ లో రూ.27,999 ధర నుంచి ప్రారంభం అవుతుంది. ఫ్లిప్ కార్డులో దీనిని పొందవచ్చు. వేరింట్ ను భట్టి ధర మారుతుంది. కొత్తగా ఫోన్ కొనేవారితో పాటు మంచి డిజైన్ కలిగిన ఫోన్ కావాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.