Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi: టైటిల్ ని చూసి కోపంతో అనిల్ రావిపూడి పీక పట్టుకున్న విక్టరీ వెంకటేష్.....

Anil Ravipudi: టైటిల్ ని చూసి కోపంతో అనిల్ రావిపూడి పీక పట్టుకున్న విక్టరీ వెంకటేష్.. వీడియో వైరల్..

Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాల టైటిల్స్ చాలా కొత్తగానూ, విచిత్రం గానూ ఉంటాయి. కానీ ఆ టైటిల్స్ జనాల్లోకి బాగా రీచ్ అవుతూ ఉంటాయి. అదే ఆయన మ్యాజిక్. ఆయన గత రెండు చిత్రాలు ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ రెండు సినిమాల టైటిల్స్ ని ప్రకటించినప్పుడు , అనిల్ రావిపూడి కి బుర్ర ఏమైనా చెడిపోయిందా?, ఇవేమి టైటిల్స్ అంటూ మండిపడ్డారు ఫ్యాన్స్. కానీ ఈ రెండు చిత్రాలు చెరో […]

Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాల టైటిల్స్ చాలా కొత్తగానూ, విచిత్రం గానూ ఉంటాయి. కానీ ఆ టైటిల్స్ జనాల్లోకి బాగా రీచ్ అవుతూ ఉంటాయి. అదే ఆయన మ్యాజిక్. ఆయన గత రెండు చిత్రాలు ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ రెండు సినిమాల టైటిల్స్ ని ప్రకటించినప్పుడు , అనిల్ రావిపూడి కి బుర్ర ఏమైనా చెడిపోయిందా?, ఇవేమి టైటిల్స్ అంటూ మండిపడ్డారు ఫ్యాన్స్. కానీ ఈ రెండు చిత్రాలు చెరో 300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి , ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఆ సెంటిమెంట్ అనిల్ రావిపూడి కి బాగా కలిసొచ్చిందో ఏమో తెలియదు కానీ, ప్రస్తుతం ఆయన వెంకటేష్ , కళ్యాణ్ రామ్ లతో చేస్తున్న చిత్రానికి కూడా అలాంటి టైటిల్ నే ప్రకటించాడు. ‘జనవరి 12 న విడుదల’ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ కాసేపటి క్రితమే ఒక వీడియో ని విడుదల చేశారు.

ఈ టైటిల్ కి క్యాప్షన్ ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అని పెట్టారు. ఇది కూడా అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో , చాలా ఫన్నీ పద్దతిలో ప్రకటించాడు. ఈ వీడియో లో వెంకటేష్ , కళ్యాణ్ రామ్ , కృతి శెట్టి, కీర్తి సురేష్ లు అనిల్ రావిపూడి వద్దకు వచ్చి , మన సినిమాకు టైటిల్ ఏంటని అందరూ అడుగుతున్నారు, ఇంతకీ ఏమి ఫిక్స్ చేసావ్ అని అడగ్గా , అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’ అని అంటాడు. అది సరే టైటిల్ ఏంటి? అని వెంకటేష్ మరోసారి అడగ్గా , అనిల్ రావిపూడి మరోసారి ‘జనవరి 12 విడుదల’ అని అంటాడు. ఎన్ని సార్లు అడిగినా అదే చెప్పడం తో , వెంకటేష్ కి కోపం వచ్చి అనిల్ రావిపూడి పీక పట్టుకుంటాడు. ఇక చివరికి టైటిల్ అదే అని అర్థం చేసుకుంటారు.

 

View this post on Instagram

 

A post shared by Anil Ravipudi (@anilravipudi)

ఇప్పటి వరకు ఈ సినిమాకు అనిల్ రావిపూడి తీసుకున్న ప్రమోషనల్ స్ట్రాటజీ మొత్తం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ప్రతీ ప్రమోషనల్ వీడియో లోనూ తన మార్కుని చూపించాడు అనిల్ రావిపూడి. ఈయన కనీసం ఈ చిత్రం తో అయినా దొరుకుతాడేమో అని అంతా అనుకున్నారు , కానీ పరిస్థితి చూస్తుంటే అలా అనిపించడం లేదు. ఈ సినిమా తో కూడా ఆయన మరో ఇండస్ట్రీ హిట్ ని అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. మరి ఆ రేంజ్ కి వెళ్తుందో లేదో చూడాలి.

 

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper