Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ రెండోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు నాగార్జున… వాళ్ల నాన్న నాగేశ్వరరావు లెగసీని కంటిన్యూ చేస్తూ సినిమా సినిమాకి తన స్టార్ డమ్ ని విస్తరించుకుంటూ వెళ్లిన నాగార్జున ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ సీనియర్ హీరోల్లో ఒకరి గా వెలుగొందుతుండటం విశేషం…ప్రస్తుతం ఆయన తన వందో సినిమాను చేస్తున్నాడు. ‘కింగ్ 100’ పేరు తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ గత కొద్ది రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగార్జున ఈ మూవీలో చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ఎలాగైనా సరే ఈ సినిమాతో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడం పక్క అంటూ అతని అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో డిఫరెంట్ సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత కూడా తనకే దక్కుతుంది. ఆయన చాలా వరకు ప్రయోగాత్మకమైన సినిమాలు చేశాడు. అందులో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని ఫెయిల్యూర్ గా మిగిలాయి. చాలామంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా తనకే దక్కింది. నాగార్జున లాంటి నటుడు తనకు నచ్చని కొంతమందిని తన సినిమాలో తీసుకోవడం లేదంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ను సైతం నాగార్జున తన సినిమాల కోసం తీసుకోవడం లేదనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఒకానొక సమయంలో ఆ సంగీత దర్శకుడు నాగార్జున సినిమాకి మ్యూజిక్ ని అందించలేదనే ఉద్దేశ్యంతో ఆ సంగీత దర్శకుడికి నాగార్జున మరో అవకాశమైతే ఇవ్వలేదట.
అలాగే కొంతమంది నటులు సైతం తను అడిగినప్పుడు డేట్స్ ఇవ్వలేదని వాళ్లను తన సినిమాలో రిపీట్ చేయడం లేదంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ నటులు ఎవరు అనే విషయం పక్కన పెడితే నాగార్జున కెరియర్ స్టార్టింగ్ లో చేసిన సినిమాల్లో ఎక్కువగా కనిపించిన వాళ్ళు ఆ తర్వాత మాత్రం కనిపించకుండా పోయారు.
వాళ్లు సైతం తన కెరియర్ స్టార్టింగ్ లో నాగార్జున సినిమాలకు సంగీతాన్ని అందించి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. కానీ ఆ తర్వాత నాగార్జున నుంచి ఒక్క అవకాశాన్ని కూడా అందుకోలేకపోయాడు. ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోల్లో ఒకడిగా ఉన్నాడు.
కాబట్టి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తను ఎవరినైతే కావాలని అనుకుంటాడో వాళ్ళని మాత్రమే తన సినిమాలో రిపీట్ చేస్తూ వాళ్లకు మాత్రమే ఎక్కువ అవకాశాలను ఇస్తూ సినిమాలను చేస్తున్నాడు…