Viswanath & Sons: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాధ్ & సన్స్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. కరుప్పు తో 300 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి, భారీ కం బ్యాక్ ఇచ్చిన సూర్య, కేవలం మూడు నెలల గ్యాప్ లోనే ‘విశ్వనాధ్ & సన్స్’ తో 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతున్న ఈ చిత్రం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. విడుదలకు ముందు ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది.
వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు వారాల తర్వాత ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేసుకునే అవకాశం ఇవ్వాలి. సరిగ్గా సెప్టెంబర్ 11 తో నాలుగు వారాలు పూర్తి అవుతాయి. అందుకే ఆరోజు అర్థ రాత్రి 12 గంటల నుండి ఈ సినిమా తెలుగు , హిందీ , తమిళ భాషలతో పాటు , ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల కాబోతుంది. గతం లో వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై పెద్ద సునామీని సృష్టించింది. గణాంకాల ప్రకారం , ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో వ్యూస్ పరంగా #RRR తర్వాతి స్థానం దక్కింది. ‘విశ్వనాధ్ & సన్స్’ కి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. థియేటర్స్ లో ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అయినప్పటికీ , ఎందుకో కంటెంట్ కి తగ్గ హిట్ కాదనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో అలా ఉండిపోయింది. ఓటీటీ లో కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందా?, లేదా లక్కీ భాస్కర్ తరహాలో అద్భుతాలు నెలకొల్పుతుందా అనేది చూడాలి.