Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలనే రూల్ ఏమి లేదు. సినిమా కోసం ఎవరైతే అహర్నిశలు కష్టపడతారో వాళ్లకు మాత్రమే ఇక్కడ విజయాలు వరిస్తాయి. రంగుల ప్రపంచం లాంటి ఈ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వాళ్ళకి మాత్రమే హరివిల్లు కనిపిస్తుంది. మిగిలిన వాళ్లు కాల రాత్రిలో వాళ్ల జీవితాన్ని గడుపుతుంటారు. అందుకే ఒక్క సక్సెస్ కోసం ఎన్నో రాత్రుల పాటు ఎదురుచూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది దర్శకులుగా మారి సక్సెస్ లను సాధించి వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు…వి ఎన్ ఆదిత్య లాంటి దర్శకుడు సైతం కెరియర్ స్టార్టింగ్ లో ‘మనసంతా నువ్వే’ లాంటి సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ కూడా ఉండడంతో ప్రేక్షకులను విశేషంగా అలరించింది. యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను సైతం మెప్పించగలిగింది.
ఆయన నాగార్జునతో చేసిన ‘నేనున్నాను’ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంది. అయితే మొదటి రెండు మూడు రోజులపాటు ఈ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది. నాగార్జున ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికి వి ఎన్ ఆదిత్య మాత్రం ప్లాప్ టాక్ రావడమేంటి అని చాలా కంగారుపడ్డాడట.
అప్పుడు నాగార్జున ఆదిత్య ను పిలిపించుకొని మనం ఒక మంచి సినిమాను తీశాం అది ప్రేక్షకుడికి రీచ్ అవ్వడానికి కొద్ది రోజులు సమయం పడుతుంది. మొదటి వారం రోజులు గడిచిన తర్వాత మన సినిమాకి సక్సెస్ఫుల్ టాక్ వస్తుంది. మనం విజయాన్ని అందుకుంటాం అని ఆయన దర్శకుడికి కాన్ఫిడెన్స్ ను ఇచ్చాడట.
నాగార్జున అన్నట్టుగానే వారం గడిచిన తర్వాత నుంచి సినిమాకు సక్సెస్ ఫుల్ టాక్ రావడం ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వచ్చి ఈ సినిమాని చూడడంతో సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఆ చనువుతోనే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ‘బాస్’ అనే మరో సినిమా కూడా తెరకెక్కింది అంటూ వి ఎన్ ఆదిత్య రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నాడు…