Homeఎంటర్టైన్మెంట్Vishwambhara Movie: మొత్తానికి 'విశ్వంభర' కు లైన్ క్లియర్ అయ్యింది.. విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్..

Vishwambhara Movie: మొత్తానికి ‘విశ్వంభర’ కు లైన్ క్లియర్ అయ్యింది.. విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్..

Vishwambhara Movie: ఎప్పుడో 2023 వ సంవత్సరం లో షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ‘విశ్వంభర'(Vishwambhara Movie) చిత్రం 2024 కి షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అప్పట్లో ఈ సినిమాపై అభిమానుల్లోనే కాదు , ప్రేక్షకుల్లో , ట్రేడ్ వర్గాల్లో కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైందో , అప్పటి నుండి ఈ సినిమా తలరాత మొత్తం మారిపోయింది. ఆ టీజర్ లోని నాసిరకపు […]

Vishwambhara Movie: ఎప్పుడో 2023 వ సంవత్సరం లో షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ‘విశ్వంభర'(Vishwambhara Movie) చిత్రం 2024 కి షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అప్పట్లో ఈ సినిమాపై అభిమానుల్లోనే కాదు , ప్రేక్షకుల్లో , ట్రేడ్ వర్గాల్లో కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైందో , అప్పటి నుండి ఈ సినిమా తలరాత మొత్తం మారిపోయింది. ఆ టీజర్ లోని నాసిరకపు గ్రాఫిక్స్ ని చూసి సోషల్ మీడియా లో వచ్చిన ట్రోల్స్, మెగా అభిమానులకు ఒక పీడకల లాంటిది. మెగా ఫ్యాన్స్ కూడా గ్రాఫిక్స్ పై డైరెక్టర్ వశిష్ఠ మీద మండిపడ్డారు. దాంతో ఈ చిత్రం విడుదల ని వెంటనే ఆపేసి, గ్రాఫిక్స్ పై రీ వర్క్ చేయడం మొదలు పెట్టారు. VFX షాట్స్ నన్ను పూర్తిగా సంతృప్తి పరిచేంత వరకు ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించను అంటూ డైరెక్టర్ వశిష్ఠ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన VFX షాట్స్ అన్నీ డెలివరీ అయిపోయాయి. రీసెంట్ గానే ఫైనల్ ఎడిటింగ్ వెర్షన్ ని చూసి మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ఠ ని మెచ్చుకున్నట్టు తెలుస్తోంది. సినిమా రెడీ గా ఉంది , కానీ విడుదల తేదీని ప్రకటించడానికి ‘పెద్ది’ కోసం ఆగారు. ఎందుకంటే ‘పెద్ది’ చిత్రాన్ని జూన్ లో విడుదల చెయ్యాలా?, లేదంటే జులై లో విడుదల చెయ్యాలా ? అనే సందిగ్ధం నిన్న మొన్నటి వరకు ఉండేది. అయితే పెద్ది టీం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జూన్ 4 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేయడం తో, ‘విశ్వంభర’ టీం తమ సినిమా విడుదల తేదీని కూడా లాక్ చేశారు. ఈ చిత్రాన్ని జులై 10 న విడుదల చేయబోతున్నారు అట .

త్వరలోనే విడుదల తేదీ తో సరికొత్త టీజర్ వీడియో ని కూడా వదలబోతున్నారట. విడుదల తేదీని లాక్ చేయడంతో , ఇప్పుడు మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా ముగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , రీ రికార్డింగ్ వర్క్ కోసం మిరాయ్ , హనుమాన్ చిత్రాలకు పని చేసిన గౌర హరి ని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పని చేశాడు , కానీ ఆయన ప్రస్తుతం బిజీ గా ఉండడం తో గౌర హరి తో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేయిస్తున్నారు. ఈ నెలాఖరు లోపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి , ఫైనల్ కాపీ ని జూన్ మొదటి వారం లోపు రెడీ చెయ్యాలనే టార్గెట్ తో పని చేస్తున్నారట మేకర్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper