Homeలైఫ్ స్టైల్Car Heat Protection Tips: మీ కారు ఎండలో ఉంటుందా.. ఇలా చేయకపోతే నష్టమే..

Car Heat Protection Tips: మీ కారు ఎండలో ఉంటుందా.. ఇలా చేయకపోతే నష్టమే..

Car Heat Protection Tips: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. బయటకు వెళ్లే మనుషులు నీళ్లు తాగడం, తలపై టోపీ లేదా గుడ్డ కప్పుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఎండలో ఎక్కువసేపు నిలిచే కారు పరిస్థితి గురించి చాలామంది ఆలోచించరు. కానీ అధిక ఉష్ణోగ్రతలు కారుపై కూడా ప్రభావం చూపుతాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వాహనం పనితీరు తగ్గడమే కాకుండా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. మరి ఇలాంటి సమయంలో కారుకు ఎలాంటి […]

Car Heat Protection Tips: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. బయటకు వెళ్లే మనుషులు నీళ్లు తాగడం, తలపై టోపీ లేదా గుడ్డ కప్పుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఎండలో ఎక్కువసేపు నిలిచే కారు పరిస్థితి గురించి చాలామంది ఆలోచించరు. కానీ అధిక ఉష్ణోగ్రతలు కారుపై కూడా ప్రభావం చూపుతాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వాహనం పనితీరు తగ్గడమే కాకుండా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. మరి ఇలాంటి సమయంలో కారుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పార్కింగ్:
కారును ఎండలో ఎక్కువసేపు పార్క్ చేయకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు చెట్టు నీడలో లేదా షెడ్డు ఉన్న ప్రదేశంలో పార్క్ చేయడం మంచిది. నేరుగా సూర్యకిరణాలు పడితే కారు ఇంటీరియర్ ఉష్ణోగ్రత కూడా ఎక్కువ అవుతుంది. దీంతో డ్యాష్‌బోర్డ్, సీట్స్, స్టీరింగ్ వంటి భాగాలను దెబ్బతీసే అవకాశం ఉంది. అందువల్ల కారు ఎండలో ఉండాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

గాజులపై సన్ షేడ్:
కారు గాజులపై సన్‌షేడ్‌లు ఉపయోగించడం చాలా ఉపయోగకరం. ఇవి సూర్యకిరణాలను తగ్గించి లోపలి వేడి తగ్గిస్తాయి. అలాగే కారులోకి వెళ్లే ముందు కొన్ని నిమిషాలు డోర్లు ఓపెన్ చేసి బయటగాలి లోపలికి,లేదా లోపలి గాలి బయటకు వెళ్లేలా చూడాలి. ఆ తరువాతనే ACఆన్ చేయాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

టైర్లు:
టైర్లపై కూడా ఎండ ప్రభావం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల టైర్ ప్రెషర్ పెరిగి బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తరచూ టైర్ ప్రెషర్ చెక్ చేయడం అవసరం. అలాగే కూలెంట్, ఇంజిన్ ఆయిల్ లెవల్స్ కూడా సరైన స్థాయిలో ఉన్నాయో లేదో పరిశీలించాలి. ఇవి తగ్గిపోతే ఇంజిన్ ఓవర్‌హీట్ అవుతుంది.

ప్లాస్టిక్ వస్తువులు:
కారులో ప్లాస్టిక్ బాటిల్స్, లైటర్లు, పవర్ బ్యాంకులు వంటి వస్తువులు ఎండలో వదిలేయడం ప్రమాదకరం. ఇవి అధిక వేడితో పేలే అవకాశం ఉంది. కాబట్టి అవసరం లేని వస్తువులు కారులో ఉంచకపోవడం మంచిది.

ఎండలో ఉన్న కారు లోకి వెళ్లే ముందు కొన్ని నిమిషాలు AC ఆన్ చేసి కూల్ చేయడం మంచిది. అలాగే నీళ్లు వెంట తీసుకెళ్లడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే కారు సురక్షితంగా ఉండటమే కాకుండా ప్రయాణం కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper