Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: చిరంజీవి రిటైర్మెంట్ ఇచ్చి రామ్ చరణ్ కి దూరంగా తనకి నచ్చిన ఆ సిటీ...

Chiranjeevi: చిరంజీవి రిటైర్మెంట్ ఇచ్చి రామ్ చరణ్ కి దూరంగా తనకి నచ్చిన ఆ సిటీ లో ఉండబోతున్నాడా..?

Chiranjeevi: తెలుగు తెరమీద చెరిగిపోని ముద్ర వేసిన హీరోల్లో చిరంజీవి ఒకరు…మెగాస్టార్ గా తనకంటూ ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఆయన చేసిన ‘మన శంకర వరప్రసాద్ సినిమా’ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చి ప్రేక్షకులందరిని అలరించింది. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక చిరంజీవి తన ఎంటైర్ కెరియర్ మొత్తాన్ని సినిమా ఇండస్ట్రీకి […]

Chiranjeevi: తెలుగు తెరమీద చెరిగిపోని ముద్ర వేసిన హీరోల్లో చిరంజీవి ఒకరు…మెగాస్టార్ గా తనకంటూ ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఆయన చేసిన ‘మన శంకర వరప్రసాద్ సినిమా’ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చి ప్రేక్షకులందరిని అలరించింది. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక చిరంజీవి తన ఎంటైర్ కెరియర్ మొత్తాన్ని సినిమా ఇండస్ట్రీకి అంకితం చేస్తున్నట్టుగా గతంలో చాలా సందర్భాల్లో తెలియజేశాడు. కానీ ఇప్పుడు ఆయన ఇంకా కొన్ని సినిమాలను చేసి రిటైర్మెంట్ ప్రకటించి వైజాగ్ నగరంలో కెళ్ళి స్థిరపడాలని చూస్తున్నాడు. రిటర్మెంట్ తర్వాత ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వైజాగ్ లోనే ఉంటానని గతంలో తను వైజాగ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడి ప్రాంత ప్రజలతో ఈ విషయాన్ని పంచుకున్నాడు. బీచ్ కి దగ్గరగా ఉంటూ ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉండడం తనకు చాలా ఇష్టమని చెప్పాడు. అలాగే ఇక్కడుండే మనుషులు కూడా చాలా సున్నితంగా ఉంటారని వాళ్ళతో మాట్లాడటం తనకు చాలా సంతోషకరంగా ఉంటుందంటూ ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు.

ఇక చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి నిజంగానే రిటర్మెంట్ ప్రకటించబోతున్నాడా? అనే వార్తలు కూడా వస్తున్నాయి. నిజానికైతే చిరంజీవి ఇప్పుడప్పుడే ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఎంచుకున్న సబ్జెక్టులు గాని, ఆయన సెలెక్ట్ చేసుకున్న దర్శకులు గానీ అతన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.

కాబట్టి ఇలాంటి సందర్భంలో చిరంజీవి మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవడానికి తీవ్రంగా ఆసక్తిని చూపిస్తున్నాడు. అందుకోసమే వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తను అనుకున్నట్టుగా భారీ విజయాలను సాధిస్తూ తన కంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటూ ఇప్పుడున్న యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలకు సైతం షాక్ ఇచ్చే ప్రయత్నమైతే చిరంజీవి చేయబోతున్నాడు…

కాబట్టి ఇప్పుడప్పుడే తను రిటైర్మెంట్ ప్రకటించే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించాల్సిన పరిస్థితి వస్తే మాత్రం అతను వైజాగ్ వెళ్లి సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఒక మంచి లైఫ్ ను లీడ్ చేస్తానని గతంలో చెప్పాడు. ఇక ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అది కొంతవరకు అసాధ్యమనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper