Homeఎంటర్టైన్మెంట్Vishwambhara movie release: 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రభావం 'విశ్వంభర' పై లేదా? బయ్యర్స్...

Vishwambhara movie release: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రభావం ‘విశ్వంభర’ పై లేదా? బయ్యర్స్ కి నమ్మకం కరువు!

Vishwambhara movie release: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన చిత్రం ‘విశ్వంభర'(Vishwambhara Movie). ‘భింబిసారా’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ వశిష్ఠ చేస్తున్న సినిమా కావడంతో ఆరంభంలో ఈ చిత్రం పై అంచనాలు భారీగానే ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైందో, అప్పటి నుండి ఈ చిత్రం పై ఉన్నటువంటి అంచనాలు మొత్తం ఆవిరి అయిపోయాయి. గ్రాఫిక్స్ అసలు ఏమాత్రం బాగాలేదని స్వయంగా మెగా ఫ్యాన్స్ […]

Vishwambhara movie release: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన చిత్రం ‘విశ్వంభర'(Vishwambhara Movie). ‘భింబిసారా’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ వశిష్ఠ చేస్తున్న సినిమా కావడంతో ఆరంభంలో ఈ చిత్రం పై అంచనాలు భారీగానే ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైందో, అప్పటి నుండి ఈ చిత్రం పై ఉన్నటువంటి అంచనాలు మొత్తం ఆవిరి అయిపోయాయి. గ్రాఫిక్స్ అసలు ఏమాత్రం బాగాలేదని స్వయంగా మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో డైరెక్టర్ పై విరుచుకుపడడం, ఇక యాంటీ ఫ్యాన్స్ అయితే ఈ గ్రాఫిక్స్ ని ట్రోల్ చేస్తూ ఎన్నో మీమ్స్ తయారు చేయడం వంటివి చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా విడుదల ని ఆపేసారు. గత ఏడాది సంక్రాంతికే ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ గేమ్ చెంజర్ కోసం వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

అలా తగ్గి మంచి పనే చేశారు. లేదంటే ఆ గ్రాఫిక్స్ తో ఈ చిత్రం విడుదల అయ్యుంటే మరో ‘భోళా శంకర్’ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేది. టీజర్ కి వచ్చిన నెగటివ్ రెస్పాన్ ని పాజిటివ్ గానే తీసుకొని, VFX టీం మొత్తాన్ని మార్చేసి, మళ్లీ కొత్తగా VFX పై పని చేయడం మొదలు పెట్టారు. ఈసారి మాత్రం VFX అదిరిపోయే రేంజ్ లో వచ్చిందట. కొత్త VFX షాట్స్ తో రీసెంట్ గానే ఒక ట్రైలర్ ని కట్ చేశారట. దానిని కొంతమంది బయ్యర్స్ కి చూపించారు. వాళ్ళు సంతృప్తి చెందారు కానీ , నిర్మాతలు అడిగినంత డబ్బులు పెట్టి కొనుగోలు చేయడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదట. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పాతబడిపోయింది. జనాల్లో పూర్తిగా ఈ సినిమా పై ఆసక్తి పోయింది. అందుకే లేటెస్ట్ ట్రైలర్ ని విడుదల చేసి, దానికి వచ్చిన రెస్పాన్స్ ని చూసిన తర్వాత ఎంత రేట్ కి కొనుగోలు చెయ్యాలి అని నిర్ణయిస్తాం అని బయ్యర్స్ అన్నారట.

అంటే బయ్యర్స్ కి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సక్సెస్ ని చూసిన తర్వాత కూడా ‘విశ్వంభర’ పై సంపూర్ణమైన నమ్మకం రావడం లేదు అన్నమాట. సంక్రాంతి కానుకగా విడుదలైన ఆ చిత్రం, బయ్యర్స్ కి దాదాపుగా 61 కోట్ల రూపాయిల లాభాలను తెచ్చిపెట్టింది. ఈమధ్య కాలం లో ఏ సినిమాకు కూడా ఇంత లాభాలు రాలేదు. అలాంటి హిట్ తర్వాత కూడా ‘విశ్వంభర’ పై నమ్మకం పెట్టడం లేదంటే , మార్కెట్ లో ఈ చిత్రానికి ఎంత చెత్త బజ్ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్ విడుదల తర్వాత కచ్చితంగా లెక్కలు మారుతాయి అనే ఆశతో ఉన్నారు మేకర్స్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టీ ఈ చిత్రాన్ని మే లేదా జూన్ నెలలో విడుదల చెయ్యాలని చూస్తున్నారట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper