Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Vishwambhara: చిరంజీవికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న విశ్వంభర...?

Chiranjeevi Vishwambhara: చిరంజీవికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న విశ్వంభర…?

Chiranjeevi Vishwambhara: సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే తప్ప ఇక్కడ రాణించడం అనేది అంత ఆశా మాషీ వ్యవహారమైతే కాదు. కానీ ఇండస్ట్రీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సిల్వర్ స్క్రీన్ మీద చెరగని ముద్ర వేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి…ఆయన చేసిన సినిమాలు ఆయన సాధించిన గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో ఒక పేరు […]

Chiranjeevi Vishwambhara: సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే తప్ప ఇక్కడ రాణించడం అనేది అంత ఆశా మాషీ వ్యవహారమైతే కాదు. కానీ ఇండస్ట్రీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సిల్వర్ స్క్రీన్ మీద చెరగని ముద్ర వేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి…ఆయన చేసిన సినిమాలు ఆయన సాధించిన గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో ఒక పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తనను బీట్ చేయగలిగే హీరో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. 70 సంవత్సరాల వయసులో కూడా ‘మన శంకర వరప్రసాద్’ లాంటి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఘనత తనకే దక్కుతుంది. ఇక ప్రస్తుతం మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇక ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి పేరు చెబితే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెను సంచలనం క్రియేట్ అవుతుంది.

ఇక అలాంటి చిరంజీవి వశిష్ట డైరెక్షన్లో చేసిన ‘విశ్వంభర ‘ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినప్పటికి గ్రాఫిక్స్ విషయంలో సినిమా అంత పెద్ద ఎఫెక్టివ్ గా రాలేదట…

అందువల్లే చిరంజీవి మూవీ మీద చాలావరకు డిసప్పాయింట్ మెంట్ తో ఉన్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక చిరంజీవి లాంటి నటుడు ఎలాంటి పాత్రలనైనా పోషించగలిగే కెపాసిటి ఉన్న నటుడు సైతం సినిమా టెక్నికల్ వర్క్ మీద అంత ఇంప్రెసివ్ గా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం…

ఇక వశిష్ట డైరెక్షన్లో ఇంతకుముందు వచ్చిన ‘బింబిసారా’ సినిమా సైతం మంచి విజయాన్ని సాధించింది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో స్టార్ట్ అయినప్పటికి అది రిలీజ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది. మరి ఇప్పటికైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper