Vishwambhara movie : మెగాస్టార్ చిరంజీవి లాంగ్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ కోసం మెగా అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఎప్పుడో 2023 వ సంవత్సరం లోనే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని , గ్రాఫిక్స్ క్వాలిటీ ఔట్పుట్ కోసం ఇన్ని రోజులు విడుదల చేయకుండా, అనుకున్న ఔట్పుట్ వచ్చే వరకు ఎదురు చూశారు . ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన పనులు మొత్తం పూర్తి అయ్యాయి. ప్రస్తుతం రీ రికార్డింగ్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. సాధ్యమైనంత వరకు ఈ చిత్రాన్ని జులై నెలలో విడుదల చెయ్యాలని చూస్తున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా బయటకు రానున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త నిన్నటి నుండి సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతోంది.
అదేమిటంటే ఈ చిత్రాన్ని కేవలం ఒక భాగంగా మాత్రమే విడుదల చేసేలా కాకుండా, రెండు భాగాలుగా విడుదల చెయ్యాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. సినిమా ఫైనల్ ఔట్పుట్ నాలుగు గంటలకు పైగానే వచ్చిందని , కొన్ని మార్పులు చేర్పులు చేసి రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని డైరెక్టర్ వశిష్ఠ అనుకుంటున్నాడని , సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగింది. దీనిని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ట్విట్టర్ లో తెలియజేయగా, డైరెక్టర్ బాబీ వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు. సెటైరికల్ టోన్ లో మాట్లాడుతూ ‘అవునా.. నిజమా’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా అందరికీ ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవ్వబోవడం లేదు, కేవలం ఒక్క భాగంగా మాత్రమే విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల అవ్వబోతుంది అనే రూమర్ కి చెక్ పడింది.
ఇకపోతే ఈ సినిమా ఫైనల్ ఔట్పుట్ పై మెగాస్టార్ చిరంజీవి చాలా సంతృప్తిగా ఉన్నాడట. ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని , అభిమానులను ఇంతకాలం ఎదురు చూసేలా చేసినప్పటికీ, మంచి ఔట్పుట్ ని వాళ్లకు అందించబోతున్నామని , ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా సంచలనాలను సృష్టిస్తుందని బలమైన నమ్మకం తో చెప్పాడట. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిష నటించగా, ఆశికా రంగనాథ్ కీలక పాత్ర పోషించింది. అదే విధంగా ఇషా చావ్లా , సురభి వంటి యంగ్ హీరోయిన్స్ చిరంజీవి కి చెల్లెళ్లుగా నటించారు.