Vishwambhara graphics issue: చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ అయిపోయి దాదాపు సంవత్సరం పైనే అవుతుంది. గత ఏడాది సమ్మర్ లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుందంటు అనౌన్స్ చేసినప్పటికి ఈ సినిమాకి చేసిన గ్రాఫిక్స్ వర్క్ చిరంజీవికి నచ్చకపోవడంతో మరో కంపెనీ తో గ్రాఫిక్స్ వర్క్ అయితే చేయించారు. ప్రస్తుతం ఆ అవుట్ పుట్ కూడా చిరంజీవికి నచ్చలేదట. దాంతో ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏంటి అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…ఈ సినిమాని ఈ సంవత్సరం అయిన రిలీజ్ చేస్తారా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైన కూడా చిరంజీవి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.
ఒకవేళ ఈ సినిమా తేడా కొడితే చిరంజీవి రీసెంట్ గా ‘మన శంకర్ ప్రసాద్’ సినిమాతో వచ్చిన సక్సెస్ కూడా వృధా అవుతుంది. ఇక మీదట కథలను బట్టి, దర్శకులను సెలెక్ట్ చేసుకొని సినిమాలకు కమిట్ అయితే బాగుంటుంది. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చిరంజీవి ముందుగా ఈ సినిమాకి కమిటైతే బాగుండేదని పలువురు విమర్శకులు సైతం విమర్శలు చేస్తున్నారు, ఇక దీనివల్ల ప్రొడ్యూసర్లు భారీగా నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
కాబట్టి ఇక మీదట ఏదైనా సినిమాకి కమిట్ అయ్యే ముందు ఆ సినిమా బడ్జెట్ ఎంత అవుతుంది. ఆ దర్శకుడు ఆ సినిమాని హ్యాండిల్ చేయగలరా? లేదా అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని సినిమ చేస్తే మంచిదని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ఇప్పటివరకు చిరంజీవి సినిమాలు అతనికి గొప్ప క్రెడిట్ ను తీసుకొచ్చి పెట్టాయి. కానీ విశ్వంభర సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా ఆయన మరోసారి తన సత్తా చాటుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ప్రస్తుతం చిరంజీవి బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు…