Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan Movie: చేతులు మారిన 'జన నాయగన్ '.. మరీ ఇంత తక్కువ రేటు...

Jana Nayagan Movie: చేతులు మారిన ‘జన నాయగన్ ‘.. మరీ ఇంత తక్కువ రేటు ఊహించలేదు..

Jana Nayagan Movie: సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల అవ్వాల్సిన తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) ‘జన నాయగన్ ‘(Jana Nayagan Movie) చిత్రం , సెన్సార్ సభ్యులు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఇన్ని రోజులు విడుదలకు నోచుకోని సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. మేకర్స్ ముందుగా కోర్టులో సెన్సార్ బోర్డు తో పోరాడారు , కోర్టు కూడా సెన్సార్ బోర్డు సభ్యులను సమర్థిస్తూ […]

Jana Nayagan Movie: సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల అవ్వాల్సిన తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) ‘జన నాయగన్ ‘(Jana Nayagan Movie) చిత్రం , సెన్సార్ సభ్యులు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఇన్ని రోజులు విడుదలకు నోచుకోని సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. మేకర్స్ ముందుగా కోర్టులో సెన్సార్ బోర్డు తో పోరాడారు , కోర్టు కూడా సెన్సార్ బోర్డు సభ్యులను సమర్థిస్తూ తీర్పు ఇవ్వడంతో , సెన్సార్ సభ్యులు సూచించిన మార్పులు చేర్పులు చేసి , లేటెస్ట్ ఎడిటెడ్ వెర్షన్ ని సెన్సార్ కి సబ్మిట్ చేశారు. అయినప్పటికీ సెన్సార్ అవ్వలేదు, ఈ గ్యాప్ లో ఈ చిత్రం సోషల్ మీడియా లో HD క్వాలిటీ లో లీక్ అయ్యింది. నిర్మాతకు ఈ ఘటన కంటి మీద కునుకు లేకుండా చేసింది.

ఇలా ఇన్ని నెగెటివ్ మధ్య ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయబోతున్నారు అనే టాక్ ఉంది. కానీ అంతకంటే ముందు మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ ని అమ్మే పనిలో ఉన్నారు. ముందుగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దాదాపుగా 90 కోట్ల రూపాయిల ఫ్యాన్సీ ప్రైజ్ తో కొనుగోలు చేసింది. సినిమా హిట్ అయితే 90 కోట్లు , లేదంటే కేవలం 50 కోట్లు మాత్రమే నిర్మాతకు చేరుతుంది, ఈ విధంగా ఒప్పందం చేసుకున్నారు. కానీ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడడంతో అమెజాన్ ప్రైమ్ తప్పుకుంది. దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని జీ 5 సంస్థ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అది కూడా కేవలం 50 కోట్ల రూపాయలకు మాత్రమే. ఈ 50 కోట్ల రూపాయిలు కూడా థియేటర్ లో విడుదలై సూపర్ హిట్ అయితేనే ఇస్తారట, లేదంటే కేవలం 30 కోట్ల రూపాయిలు మాత్రమే ఇస్తారట.

ఈ డీల్ పై ప్రస్తుతం KVN సంస్థ జీ 5 సంస్థ తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే రేపు తమిళనాడు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ్ TVK పార్టీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. అనేక సర్వేలు ఆయనకు డబుల్ డిజిట్ ఓటు షేర్ , సింగల్ డిజిట్ సీట్లు వస్తాయని అంచనా వేయగా, ఒక్క సర్వే మాత్రం విజయ్ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాడని రిపోర్ట్ ఇచ్చింది. ఇదే కనుక రేపు జరిగితే ‘జన నాయగన్ ‘ చిత్రానికి పాజిటివ్ పబ్లిసిటీ మామూలు రేంజ్ లో రాదనే చెప్పాలి. ఈ ఊపులో విడుదల చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ ని తలపించే వసూళ్లు నమోదు అవుతాయి. ఒకవేళ అలా కాకుండా, రేపటి ఎన్నికల ఫలితాలు TVK కి నెగెటివ్ గా వస్తే ‘జన నాయగన్ ‘ పై కాస్త ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఏమి జరగబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper