Homeఎంటర్టైన్మెంట్'పవన్ కళ్యాణ్' కథ పై విజయేంద్రప్రసాద్ క్లారిటీ !

‘పవన్ కళ్యాణ్’ కథ పై విజయేంద్రప్రసాద్ క్లారిటీ !

రచయిత విజయేంద్ర ప్రసాద్ వయసు అయిపోయాక ఫేమస్ అయ్యారు. నలభై ఐదేళ్లు ఇండస్ట్రీలో ఉంటే.. ఆయనకు పదేళ్ల క్రితం నుండి మంచి గుర్తింపు వచ్చింది. ఇది ఆయనకు కాస్త ఇబ్బంది అట. వయసులో ఉన్నప్పుడు ఈ స్టార్ స్టేటస్ వచ్చి ఉంటే బాగుండేది అంటూ తెగ బాధ పడుతున్నారు. ఏది ఏమైనా ‘బాహుబలి’, ‘భజరంగి భాయిజాన్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో విజయేంద్ర ప్రసాద్ అంటే పాన్ ఇండియా రైటర్ అనే స్థాయికి వెళ్లిపోయారు. అందుకే, విజయేంద్ర […]

Vijayendra Prasad Pawan Kalyanరచయిత విజయేంద్ర ప్రసాద్ వయసు అయిపోయాక ఫేమస్ అయ్యారు. నలభై ఐదేళ్లు ఇండస్ట్రీలో ఉంటే.. ఆయనకు పదేళ్ల క్రితం నుండి మంచి గుర్తింపు వచ్చింది. ఇది ఆయనకు కాస్త ఇబ్బంది అట. వయసులో ఉన్నప్పుడు ఈ స్టార్ స్టేటస్ వచ్చి ఉంటే బాగుండేది అంటూ తెగ బాధ పడుతున్నారు. ఏది ఏమైనా ‘బాహుబలి’, ‘భజరంగి భాయిజాన్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో విజయేంద్ర ప్రసాద్ అంటే పాన్ ఇండియా రైటర్ అనే స్థాయికి వెళ్లిపోయారు.

అందుకే, విజయేంద్ర ప్రసాద్ పై కూడా అనేక రూమర్స్ ను క్రియేట్ చేస్తూ హడావిడి చేస్తుంటారు గాసిప్ రాయుళ్లు. ఇందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఆయన ‘దేవర’ అనే ఓ గొప్ప ఎమోషనల్ యాక్షన్ కథని రెడీ చేశారని వార్తలు పుట్టించారు. పైగా ఈ పుకారును బాగా ప్రచారం చేశారు. ఈ మ్యాటర్ పెద్దాయన దగ్గరకు పోయింది.

‘అరె నేను ఎప్పుడు కథ రాశానయ్యా’ అంటూ ఆయన షాక్ అవుతున్నారు. పనిలో పనిగా ఈ వార్త పై పెదవి విప్పారు. ఈ వార్తలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, రీసెంట్ గా నిర్మాత బండ్ల గణేష్, విజయేంద్ర ప్రసాద్ ని కలిశారట. పవన్ కళ్యాణ్ కోసం ఒక కథ అడిగారట. విజయేంద్రప్రసాద్ కూడా ఒక లైన్ చెప్పాడు. కానీ పవన్ కి ఆ లైన్ నచ్చలేదు.

మరి పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానం అని చెప్పే విజయేంద్రప్రసాద్.. పవన్ కోసం మరో కథ రాస్తాడా ? చూడాలి. ఏది ఏమైనా రాజమౌళి తండ్రిగా కన్నా కథారచయితగానే విజయేంద్రప్రసాద్ కి మంచి స్టార్ డమ్ వచ్చింది. బాలీవుడ్ లో కూడా విజయేంద్రప్రసాద్ కథల కోసం బాగా డిమాండ్ పెరిగింది. తమిళంలో కూడా విజయ్ కి ‘అదిరింది’ వంటి కథలు ఇచ్చారాయన.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper