Bajaj Pulsar 2026: భారతదేశంలో బజాజ్ కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా టూవీలర్స్ విషయంలో వినియోగదారుల అవసరాలను, ఆకర్షణను దృష్టిలో ఉంచుకొని సరికొత్త వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ కంపెనీ నుంచి ‘పల్సర్’ బైక్ ను మార్కెట్లోకి తీసుకొచ్చి అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఈ పల్సర్ ఇప్పుడు సరికొత్త వేరియంట్ లో రాబోతుంది. ఇది సరికొత్త నెక్స్ట్ జనరేషన్ వెర్షన్ ను ఆగస్టు 12న మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీనిపై ఆసక్తిక విశేషాలేంటంటే?
బజాజ్ కంపెనీ నుంచి పల్సర్ బ్రాండ్ ప్రారంభమై దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను తీసుకొస్తోంది. ఈ ఆవిష్కరణలో భాగంగా ‘పల్సర్ 150’ ‘పల్సర్ 125’ నెక్స్ట్ జెన్ వేరియంట్‌ను పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటు ఇటీవల టెస్టింగ్‌లో కనిపించిన ‘ ఎన్160 4వి’ కూడాసందడి చేయడానికి సిద్ధంగా ఉంది.
ఈ నెక్స్ట్ జనరేషన్ పల్సర్‌లో డిజైన్ పరంగా భారీ మార్పులు ఉండనున్నట్లు సమాచారం. పూర్తి ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్, సరికొత్త గ్రాఫిక్స్, మస్కులర్ లుక్‌తో బాడీ ప్యానెల్స్‌ను రూపొందించారు. సాంకేతికంగా డిజిటల్ లేదా టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, మెసేజ్ అలర్ట్‌ల వంటి మోడర్న్ ఫీచర్లు ఉండనున్నాయి.
కొత్త తరం మోడళ్లలో పవర్‌ఫుల్ పర్ ఫార్మెున్స్ ఉండనుంది. ఇందులో 4 వాల్వ్ ఇంజన్ టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నారు. మెరుగైన ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీ కారణంగా కొత్త వేరియంట్ల ధరలు ప్రస్తుతం ఉన్న మోడళ్ల కంటే రూ. 5,000 నుండి రూ. 10,000 వరకు అదనంగా ఉండే అవకాశం ఉంది. పండుగ సీజన్ ఆరంభంలో మార్కెట్లోకి వస్తున్న ఈ కొత్త పల్సర్ టీవీఎస్ అపాచీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.