Homeఎంటర్టైన్మెంట్Star Heroes: స్టార్ హీరోల సినిమాల్లో ఇవి మిస్ అవుతున్నాయి అందుకే రిజల్ట్ తేడా కొడుతుంది...

Star Heroes: స్టార్ హీరోల సినిమాల్లో ఇవి మిస్ అవుతున్నాయి అందుకే రిజల్ట్ తేడా కొడుతుంది…

Star Heroes: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో మన సినిమాని ముందుకు తీసుకెళ్తూ గొప్ప విజయాలను సాధిస్తూ అత్యధిక వసూళ్లను సాధించిన హీరోలుగా మన వాళ్ళు నిలుస్తుండటం విశేషం… ఇప్పటివరకు మన వాళ్లు ఎలాంటి సక్సెస్ లను సాధించినా కూడా ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో మాత్రం చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుండడం విశేషం… తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని […]

Star Heroes: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో మన సినిమాని ముందుకు తీసుకెళ్తూ గొప్ప విజయాలను సాధిస్తూ అత్యధిక వసూళ్లను సాధించిన హీరోలుగా మన వాళ్ళు నిలుస్తుండటం విశేషం… ఇప్పటివరకు మన వాళ్లు ఎలాంటి సక్సెస్ లను సాధించినా కూడా ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో మాత్రం చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుండడం విశేషం… తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని తీసుకొచ్చుకొని ఆ పరిస్థితులకు అనుగుణంగా ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి మన హీరోలు ఎప్పుడు కమర్షియల్ ఫార్మాట్లోనే నడుస్తున్నారు. దానివల్ల సినిమా చూసే ప్రేక్షకులకు కథలో పెద్దగా వైవిధ్యం అయితే కనిపించడం లేదు. ఒక్కసారి వాళ్ళ బోర్డర్స్ ని దాటి డిఫరెంట్ సినిమాలను ట్రై చేస్తే ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీకే మన హీరోలు పరిమితం అయిపోయారు.

కాబట్టి ఇక్కడ ప్రేక్షకులకు కమర్షియల్ సినిమాలు మాత్రమే నచ్చుతాయని అలాంటి జానర్ లోనే సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించారు. కానీ ఇప్పుడు మన ఇండస్ట్రీ స్పాన్ పెరిగింది. ఇండియాలో ప్రతి ఒక్క ప్రేక్షకుడు మన తెలుగు హీరోల సినిమాలను చూడడానికి ఇష్టపడుతున్నారు.

బాలీవుడ్ హీరోల కంటే కూడా మన వాళ్లకు ఎక్కువ డిమాండ్ పెరిగిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు మనవాళ్లు ఆ కమర్షియల్ సినిమాలను కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలను చేస్తూ అందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని ఎక్కువగా ఆడ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా సూపర్ సక్సెస్ లను సాధించవచ్చు అని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో మన వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది… అందులో ఏమాత్రం తేడా జరిగినా కూడా మన హీరోలు చేసే సినిమాలు భారీ డిజాస్టర్లను మూటగట్టుకునే ప్రమాదం ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper