Mahesh Babu: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మొదటిసారి మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిధిని దాటి డైరెక్ట్ గా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం…నిజానికి ఈ సినిమా మీద 1500 కోట్లు బడ్జెట్ ని కేటాయిస్తున్నారు అంటే ప్రొడ్యూసర్లు ఒకరకంగా రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. మహేష్ బాబుకి 200 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ లేదు. కానీ రాజమౌళి ఉన్నాడనే ధైర్యంతోనే వాళ్ళు 1500 కోట్లు పెట్టడానికి ముందుకు వచ్చారు. నిజానికి రాజమౌళి లాంటి దర్శకుడు ఇంతకుముందు చేసిన సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు భారీ సక్సెస్ ని కట్టబెట్టాడు. దాంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయి ఏంటో అందరికి అర్థమైంది మరోసారి వారణాసి సినిమాతో తన స్టామినాయేంటో ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు… ఇక అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే రాజమౌళి క్రేజ్ కు తిరిగి ఉండదనే చెప్పాలి.
మహేష్ బాబు కొడుకు అయిన గౌతమ్ కృష్ణ సైతం ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడట. మహేష్ బాబు గౌతమ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేద్దామని చూస్తున్నాడు. అందుకే తనకి నటనలో మెలకువలను కూడా నేర్పిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉండటంతో గౌతమ్ కృష్ణ ని భాగం చేశారట.
మరో రెండు సంవత్సరాల్లో తనను ఎలాగో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తారు. కాబట్టి దాని కంటే ముందే ఈ పాత్రలో కనిపిస్తే తనకి బాగుంటుందని ఎలాగో ఈ సినిమా పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతుంది. కాబట్టి గౌతమ్ కి ప్రపంచ స్థాయి ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు వస్తుందని మహేష్ బాబు భావిస్తున్నారట. గతంలో విజయేంద్ర ప్రసాద్ సైతం గౌతమ్ వారణాసి లో నటించే అవకాశం ఉందని చెప్పాడు.
ఇక ఇప్పటికే మహేష్ బాబు చేసిన 1 నేనొక్కడినే సినిమాలో గౌతమ్ కృష్ణ నటించిన విషయం మనందరికీ తెలిసిందే. అతను చాలా మంచి నటుడు ఆ సినిమాలో వైవిద్య భరితమైన నటనను చూపించాడు. ఈ సినిమాలో జక్కన్న అతని నుంచి ఎలాంటి నటనను రాబడుతాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…