Bhogapuram Airport ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భోగాపురం విమానాశ్రయ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. 2015 వ సంవత్సరం లో చంద్రబాబు నాయుడు కేంద్రం తో మాట్లాడి భోగాపురం విమానాశ్రయ ఏర్పాట్ల కోసం భూసేకరణ చేపట్టారు. అప్పట్లో ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నటువంటి జగన్, ఈ విమానాశ్రయాన్ని తీసుకొని రావడంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎర్రబస్సు కూడా లేని ప్రాంతం లో విమానాశ్రయం ఎందుకు , దీన్ని ఎలా అయినా హై కోర్టు వరకు వెళ్లి అడ్డుకుంటాను అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే 2019 లో జగన్ ప్రభుత్వం ఏర్పడింది. నాలుగేళ్ల వరకు ఈ విమానాశ్రయ పనులను పట్టించుకోలేదు. దీంతో జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో 2023 వ సంవత్సరం లో సీఎం హోదాలో జగన్ ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడే లోపు దాదాపుగా 30 శాతం పనులు పూర్తి అయ్యాయి. ఇక ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలకు విమానాశ్రయ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఆగస్టు 1 న ఎంతో ఘనంగా ఈ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున రీసెంట్ గానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ కి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని ఆహ్వానించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ , ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తున్నారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి రీసెంట్ గానే కుడి భుజానికి సర్జరీ అయ్యింది. ప్రస్తుతం ఆయన మంగళగిరి క్యాంపు కార్యాలయం లోనే విశ్రాంతి తీసుకుంటూ , మరో పక్క తన విధులను కూడా నిర్వహిస్తున్నారు.
అయితే డాక్టర్లు పవన్ కళ్యాణ్ ని రెండు వారాల వరకు బయటకు ఎక్కడికీ కూడా వెళ్లరాదని సూచించారు. రెండు వారాలు దాదాపుగా పూర్తి అయ్యాయి. అయితే నేడు పవన్ కళ్యాణ్ నీటి పారుదల శాఖ మంత్రి తో తన క్యాంపు కార్యాలయం లో భేటీ అయ్యారు. ఇప్పటికీ ఆయన చేతి కట్టుతోనే కనిపించారు. దీంతో పవన్ కళ్యాణ్ వస్తున్నారా లేదా అనే సందేహాలు ఇప్పుడు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన మంత్రి మోడీ , సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొనే మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేకపోతే , ప్రతిపక్ష పార్టీ కి సంబంధించిన మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారాలు చేసే అవకాశం ఉందని సోషల్ మీడియా కూటమి అభిమానులు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ వస్తున్నారో లేదో ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారిన అంశం.