Jason Sanjay: తమిళనాడు లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగి , నేడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్న విజయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నికల ముందు ఆయనకు అనేక సవాళ్లు ఎదురు అయ్యాయి. తన వ్యక్తిగత జీవితం పై ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసేవారు ప్రతిపక్ష పార్టీ నేతలు. అంతే కాకుండా సరిగ్గా ఎన్నికల సమయం లో విజయ్ సతీమణి సంగీత ఫ్యామిలీ కోర్టు లో విజయ్ నుండి తనకు విడాకులు కావాలని కోరడం, అంతే కాకుండా అతనిపై సంచలన ఆరోపణలు చేయడం తమిళనాడు రాష్ట్రాన్ని షేక్ చేసింది. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ కూడా తల్లి వైపే ఉన్నాడు. కనీసం విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా సంజయ్ రాకపోవడం తో తండ్రి పై ఆయన పీకల దాకా కోపం తో ఉన్నట్టు అంతా అనుకున్నారు.
కానీ అలాంటిదేమి లేదని రీసెంట్ గా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ని చూస్తే తెలుస్తోంది. ఆయన మాట్లాడుతూ ‘నా తండ్రి తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఒక చారిత్రాత్మక ఘట్టం. దీన్ని ఒక విప్లవం గానే నేను పరిగణిస్తాను. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక , నాకు , మా చెల్లికి , మా ఇంట్లో వాళ్ళందరికీ బాధ్యత పెరిగింది. కష్టపడి నాన్న నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడాలి , ఆయన లేజసీ ని విజయవంతంగా కొనసాగించాలి. సినీ ఇండస్ట్రీ లోకి వస్తానని చెప్పినప్పుడు నాన్న నాకు ఇచ్చిన సలహా ఒక్కటే. సొంతంగా నీకంటూ ఒక పేరు , గుర్తింపు ని సంపాదించుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా సహాయం కావాలంటే అడుగు , కానీ ఎంత కష్టమొచ్చినా నీ కాళ్లపై నువ్వే నిలబడే ప్రయత్నం చెయ్యాలి’ అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి.
ఇకపోతే రీసెంట్ గానే ఆయన సిగ్మా అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. మన టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన సందీప్ కిషన్ ఈ చిత్రం లో హీరో గా నటించాడు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో సంజయ్ ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఆ ప్రొమోషన్స్ లో భాగంగానే ఈ ఇంటర్వ్యూ ఇచ్చాడు. సాధారణంగా ఏ సూపర్ స్టార్ కొడుకు అయినా ముందుగా హీరో గా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటారు. కానీ సంజయ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వాలని అనుకోవడం చాలా విభిన్నమైన ఆలోచన. మరి ఆయన డైరెక్టర్ గా ఈ సినిమాతో సక్సెస్ ని అందుకుంటాడో లేదో చూడాలి.