Bhagyashri Borse : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు భాగ్యశ్రీ భొర్సే . లాక్ డౌన్ తర్వాత ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోయిన్స్ లో అందం తో పాటు , నటన కూడా ఉన్నటువంటి అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. నిన్న గాక మొన్ననే ఈమె హీరోయిన్ గా నటించిన ‘లెనిన్’ చిత్రం విడుదలై పెద్ద హిట్ అయ్యింది. కానీ ఇంత లోపే పెళ్లి పీటలు ఎక్కింది అంటూ వార్తలు వచ్చాయేంటి?, నిజంగానే ఆమె పెళ్లి చేసుకుందా?, పెళ్లి కొడుకు ఎవరు?, ఇలా ఎన్నో రకాల అనుమానాలు మీ మెదడులో కలిగే ఉంటాయి. అయితే నిజ జీవితం లో భాగ్యశ్రీ పెళ్లి పీటలు ఎక్కలేదు. ఇది కేవలం ‘లెనిన్’ మూవీ కి సంబంధించిన ఆఫ్ స్క్రీన్ ఫోటోలు మాత్రమే.
పెళ్లి బట్టల్లో అందంగా ముస్తాబు అవుతున్న సమయం లో తీసుకున్న కొన్ని ఫోటోలను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. అంతే కాకుండా ‘లెనిన్’ మూవీ షూటింగ్ సమయం లో తన జర్నీ కి సంబంధించిన ఫొటోలన్నీ ee పోస్టులో పోందుపర్చింది భాగ్యశ్రీ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ని చేసినందుకు ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఆ దేవుడికి కి స్పెషల్ థాంక్స్ చెప్పుకుంటున్నాను. కష్టపడడం, ఆ తర్వాత పూర్తిగా నీకు లొంగిపోవడమే నాకు తెలుసు’ అంటూ భాగ్యశ్రీ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే గత కొంతకాలం నుండి భాగ్యశ్రీ యంగ్ హీరో రామ్ పోతినేని తో ప్రేమాయణం నడుపుతుందని , వీళ్లిద్దరు డేటింగ్ చేస్తున్నారని , ఇలా సోషల్ మీడియా లో ఎన్నో రకాల ప్రచారాలు జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే.
రీసెంట్ గా ‘లెనిన్’ మూవీ ప్రమోషన్స్ లో రామ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె బ్లష్ అయ్యే విధానం ని చూసి నిజంగానే వీళ్లిద్దరి మధ్య ఎదో జరుగుతోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఇలా ఉండగా భాగ్యశ్రీ భొర్సే కి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత వచ్చిన మొట్టమొదటి సక్సెస్ ‘లెనిన్’. అంతకు ముందు ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె కోలీవుడ్ లో శివ కార్తికేయన్ తో కలిసి ఒక సినిమా చేస్తోంది , ఈ సినిమా కూడా సిక్స్ సాధిస్తుందో లేదో చూడాలి.