Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వచ్చిందంటే చాలు, తెలుగు రాష్ట్రాల్లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. ఎక్కడ చూసినా అభిమానులు సేవా కార్యక్రమాలు చేస్తూ , సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇక సోషల్ మీడియా సంగతి సరే సరి. ఎంత పెద్ద పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అయినా సరే, చిరంజీవి పుట్టినరోజు వచ్చిందంటే, ఆయనతో తమకు ఉన్నటువంటి మధురమైన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉంటారు. అంతే కాదు , మెగాస్టార్ చిరంజీవి అనే బ్రాండ్ , రాజకీయాలకు అతీతం అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రతీ రాజకీయ పార్టీ లోని ప్రముఖ నాయకులంతా మెగాస్టార్ ఫ్యాన్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు ఉదాహరణ వైసీపీ పార్టీ మాజీ మంత్రి కొడాలి నాని చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడమే. ఈయన జూనియర్ ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడు.
మాజీ సీఎం జగన్ కి భక్తుడు లాంటోడు. అలాంటి కొడాలి నాని , చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని , అభిమానులతో కలిసి సంబరం చేసుకోవడం అంటేనే అర్థం చేసుకోవచ్చు , ప్రతీ రాజకీయ పార్టీలోనూ ఆయన అభిమానులు ఉన్నారని. కేక్ కటింగ్ సంబరాలు అనంతరం కొడాలి నాని మీడియా తో మాట్లాడుతూ ‘మెగాస్టార్ చిరంజీవి గారి 71 వ జన్మదినం సందర్భంగా , ఆయన అభిమానుల సమక్ష్యం లో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. చిరంజీవి గారు నిండు నూరేళ్లు , ఆరోగ్యంతో , మన అందరితో కలిసి జీవించాలి, అదే విధంగా ఆయన వారసుడు రామ్ చరణ్ కూడా మంచి మెగాస్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నాడు. ఆయన కూడా భవిష్యత్తులో ఇంకా గొప్ప ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కాకా మూవీ టీజర్ ని విడుదల చేశారు. ఆ చిత్రం కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు కొడాలి నాని.
దీనిపై సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి , పవన్ కళ్యాణ్ లకు వైసీపీ పార్టీ లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది వాస్తవం. నెల్లూరు నుండి సీమ వరకు ఉండే ప్రతీ వైసీపీ అభిమాని చిరంజీవి , పవన్ కళ్యాణ్ అభిమానులే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు కాస్త దూరమైన విషయం వాస్తవమే కానీ , ఇలా సందర్భం వచ్చినప్పుడు బయటకు వచ్చి తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు . సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న కొడాలి నాని వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని
గుడివాడలో జరిగిన చిరంజీవి 71వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని
అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నాని
సినీ రంగంలో ఎందరికో ఆదర్శనీయమైన వ్యక్తి చిరంజీవి అని… pic.twitter.com/xxWBilU1Ua
— TV9 Telugu (@TV9Telugu) August 22, 2026