Venkatesh Heroine: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేసిన ప్రేమించుకుందాం రా సినిమా అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ఒక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఒక లవ్ స్టోరీ ని తీసిన విధానం కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేసిందనే చెప్పాలి.
ఈ సినిమాతో వెంకటేష్ ఒక్కసారిగా టాప్ లెవెల్ లోకి వెళ్లిపోయాడు. ఇక ఈ సినిమాతో అంజలి జవేరి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో హీరోయిన్ గా కూడా ఆమె ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలందరితో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఇక అందులో భాగంగానే ఆమె చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో సక్సెస్ లను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా గ్రౌండ్ గా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
అందులో భాగంగానే బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం తనని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో తీసుకోవాలని చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బోయపాటి రాసుకున్న స్టోరీ వినగానే బాలయ్య ఈ క్యారెక్టర్ లో అంజలి జవేరీ అయితే బాగుంటుందని బోయపాటికి రికమండు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక బోయపాటి కూడా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి క్యారెక్టర్ వినగానే బాలయ్య బాబుకి మైండ్ లో అంజలి జవెరి లాంటి ఒక స్టార్ నటి గుర్తుకు రావడం అనేది నిజంగా ఆమె నటన ప్రతిభకు కొలమానమనే చెప్పాలి.
ఆమె చేసే పాత్ర అంటే అది తప్పకుండా ఒక డీసెంట్ పాత్ర అనే తెలుస్తుంది. ఇక ఇప్పటికే అభిమానులు బాలయ్య బాబు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే దాంట్లో ఆమె చేసే క్యారెక్టర్ కోసం కూడా ఎదురుచూస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇక ఇయర్ ఎండింగ్ లో ఈ సినిమా సెట్స్ మీద వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి…