Star Heroine: 2022లో విడుదలైన సీతారామం బ్లాక్ బస్టర్ హిట్. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. పీరియాడిక్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. ఉత్కంఠ రేపే స్క్రీన్ ప్లే తో అద్భుతమైన ప్రేమ కథను దర్శకుడు వెండితెర మీద ఆవిష్కరించాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేసింది. రష్మిక మందాన ఒక కీలక రోల్ చేసింది. తెలుగుతో పాటు హిందీలో కూడా సీతారామం మంచి వసూళ్లు రాబట్టింది.
సీతారామం మృణాల్ కి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. సీత పాత్రలో ఆమె మెస్మరైజ్ చేయగా టాలీవుడ్ లో ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అయితే సీతారామం లో సీత పాత్ర కోసం మొదట అనుకున్న హీరోయిన్ వేరొకరట. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేని హను రాఘవపూడి సంప్రదించాడట. అయితే పూజా హెగ్డే బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో ఆఫర్ తిరస్కరించారట. 2022లో పూజ నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ చిత్రాలు విడుదలయ్యాయి.
అయితే వీటిలో ఒక్కటి కూడా ఆడలేదు. వరుస డిజాస్టర్స్. పూజా కెరీర్లో అత్యంత బ్యాడ్ ఫేజ్ 2022లో చూసింది. ఆమె కోలుకోలేని దెబ్బతింది. పూజా చేతిలో ఇప్పుడు అధికారికంగా ఒక్క ఆఫర్ లేదు. ఆమె డైరీ నిల్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ కి జంటగా ఒక చిత్రానికి సైన్ చేశారని ప్రచారం జరుగుతుంది. సీతారామం మూవీ చేస్తే ఆమెకు ఒక భారీ హిట్ పడేది. మంచి పాత్ర దక్కేది.
మరోవైపు చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా చేజారాయి. విజయ్ దేవరకొండకు జంటగా సైన్ చేసిన జనగణమన మధ్యలో ఆగిపోయింది. ఒక షెడ్యూల్ కూడా జరిపాక నిర్మాతలు తప్పుకున్నారు. అలాగే గుంటూరు కారం చిత్రాన్ని వదులుకుంది. మొదట్లో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే, సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల అనుకున్నారు. శ్రీలీలను మెయిన్ చేసి పూజా హెగ్డేని సెకండ్ హీరోయిన్ చేయడంతో నచ్చక మధ్యలో వదిలేసింది. పరిశ్రమలో టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలి అంటారు అందుకే…
Web Title: Star heroine missed the blockbuster movie sitha ramam
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com