Homeఎంటర్టైన్మెంట్Venkatesh Drishyam 3: డైరెక్టర్ తో విబేధాలు..వెంకటేష్ 'దృశ్యం 3' ఇక లేనట్టేనా..? పూర్తి వివరాలు...

Venkatesh Drishyam 3: డైరెక్టర్ తో విబేధాలు..వెంకటేష్ ‘దృశ్యం 3’ ఇక లేనట్టేనా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!

Venkatesh Drishyam 3: ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చిత్రం ‘దృశ్యం'(Drushyam). మలయాళం లో ఈ చిత్రాన్ని ముందుగా జీతూ జోసెఫ్ మోహన్ లాల్ తో తీసాడు. అక్కడ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడం తో, తెలుగు లో ఈ చిత్రాన్ని వెంకటేష్ రీమేక్ చేశాడు. తొలిభాగం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఇక ఆ తర్వాత హిందీ లో అజయ్ దేవగన్ […]

Venkatesh Drishyam 3: ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చిత్రం ‘దృశ్యం'(Drushyam). మలయాళం లో ఈ చిత్రాన్ని ముందుగా జీతూ జోసెఫ్ మోహన్ లాల్ తో తీసాడు. అక్కడ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడం తో, తెలుగు లో ఈ చిత్రాన్ని వెంకటేష్ రీమేక్ చేశాడు. తొలిభాగం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఇక ఆ తర్వాత హిందీ లో అజయ్ దేవగన్ రీమేక్ చేసి, ఆయన కూడా పెద్ద హిట్ కొట్టాడు. అయితే దృశ్యం 2 అటు మలయాళం లో, ఇటు తెలుగు లో కరోనా లాక్ డౌన్ కారణంగా డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల అయ్యాయి. మరో పక్క బాలీవుడ్ ‘దృశ్యం 2’ ని అజయ్ దేవగన్ డైరెక్ట్ గా థియేటర్స్ లో విడుదల చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.

ఇకపోతే ఈ ఫ్రాంచైజ్ నుండి చివరి చిత్రం ‘దృశ్యం 3’ షూటింగ్ ని రీసెంట్ గానే మలయాళం లో మోహన్ లాల్ తో మొదలు పెట్టి, పూర్తి కూడా చేసేసాడు డైరెక్టర్ జీతూ జోసెఫ్. ఈ సమ్మర్ కానుకగా ఈ చిత్రం మలయాళం లో విడుదల కాబోతుంది. అయితే తెలుగు లో ‘దృశ్యం 3’ సెట్స్ మీదకు వెళ్ళడానికి చాలా సమయం తీసుకునేలా అనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలు అయ్యేలోపు, మలయాళం ‘దృశ్యం 3’ ఓటీటీ లోకి వచ్చేస్తుంది. దీంతో ఈ చిత్రం లోని ట్విస్టులు, టర్నులు మొత్తం సోషల్ మీడియా లో లీక్ అయిపోతాయి. అలా జరిగితే సినిమా తీసి వృధా. కమర్షియల్ గా వర్కౌట్ అవ్వదు. అందుకే విక్టరీ వెంకటేష్ జీతూ జోసెఫ్ ని తెలుగు వెర్షన్ కోసం కొత్త కథ రెడీ చెయ్యమని అడిగాడట.

కానీ జీతూ జోసెఫ్ అందుకు ఒప్పుకోలేదు. ఈ సిరీస్ ముగింపు కి న్యాయం చేయాలంటే, మలయాళం వెర్షన్ తో మాత్రమే సాధ్యం అని చెప్పాడట. ఈ విషయం లో విక్టరీ వెంకటేష్, జీతూ జోసెఫ్ మధ్య అభిప్రాయం బేధాలు వాచినట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు వెంటనే ‘దృశ్యం 3’ షూటింగ్ ని మొదలు పెడితే రెండు నెలల్లో పూర్తి చేయొచ్చు. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు, మలయాళం వెర్షన్ కథతోనే దింపేయొచ్చు . కానీ వెంకటేష్ డేట్స్ ఖాళీగా లేవు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రం చేస్తున్న వెంకటేష్, ఈ సినిమా పూర్తి అయిన వెంటనే అనిల్ రావిపూడి చిత్రానికి షిఫ్ట్ అవుతాడు. దీంతో ఇక్కడ ‘దృశ్యం 3’ కి గ్యాప్ లేదు. కానీ సురేష్ బాబు మాత్రం ఈ చిత్రాన్ని ఎలా అయినా నిర్మించాలి అనే పట్టుదలతో ఉన్నాడు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper