Bangladesh Election Result: బంగ్లాదేశ్‌లో 18 నెలల మహ్మద్ యూనస్ పాలన ముగియనుంది. తాజాగా నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ నేతృత్వంలోని కూటమి విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. బీఎన్‌పీ చీఫ్ తారీఖ్ అహ్మద్ ప్రధాని కాబోతున్నారు. 18 నెలలుగా భారత వ్యతిరేక విధానాలు అవలంభించిన మహ్మద్ యూనస్ ప్రభుత్వం కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో కొత్త ప్రభుత్వం ఎలా ఉంటుంది అన్న ఆసక్తి నెలకొంది. అయితే విశ్లేషకులు మాత్రం బీఎన్‌పీ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో భారత్‌తో సంబంధాలు సానుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
పార్టీ చరిత్రలో భారత సంబంధాలు
బీఎన్‌పీ మునుపటి పాలనల్లో భారత్‌తో సమతుల్య వాతావరణాన్ని నిర్వర్తించింది. 2001–2006 మధ్య ప్రధాని ఖాలిదా జియా నేతృత్వంలో వాణిజ్యం, ఆర్థిక సహాయం, సరిహద్దు సమస్యలపై చర్చలు సక్రమంగా సాగాయి. అవామీ లీగ్‌తో పోలిస్తే బీఎన్‌పీ తక్కువ ఉద్రిక్తతలు సృష్టించి, పొరుగు దేశాలతో ఆర్థిక సహకారం పొందింది.
తారీఖ్ రహ్మాన్ వైఖరి..
తారీఖ్ రహ్మాన్ నేతృత్వం ఆర్థిక పునరుద్ధరణకు భారత వాణిజ్యాన్ని ఆశ్రయిస్తుందని తెలుస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించిన తారీఖ్ రహ్మాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల సత్సంబంధాలు మెరుగుపడేలా సంకేతం ఇచ్చారు. విద్యుత్ సరఫరా, ఆర్థిక సహాయం పునరావృతానికి మార్గం తీసుకొస్తుందని అంచనా. క్రికెట్, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సహజంగా పునరుద్ధరించబడతాయని అంచనా.
సవాళ్లు, అవకాశాలు
జమాత్ మద్దతు కొంత అనిశ్చితిని తెచ్చినప్పటికీ, బీఎన్‌పీ దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా భారత్‌తో సహకారాన్ని పెంచుతుంది. హిందూ సమాజ రక్షణపై ప్రాధాన్యత ఇస్తూ విశ్వాసాన్ని తిరిగి పొందుతుంది. దీర్ఘకాలంలో వాణిజ్యం, రక్షణ, మౌలిక సదుపాయాల్లో ద్విపక్ష బంధాలు బలపడే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ పార్టీ భారత అనుకూల వాతావరణాన్ని పెంపొందించే అవకాశాలు ఎక్కువ.