Trivikram Srinivas: మాటల మాంత్రికుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న దర్శకుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’… ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. వెంకటేష్ తో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విషయంలో ఆయన పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అక్టోబర్ 2 వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరివేగంగా జరుపుతున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అందులో హీరో తన భార్య చెప్పు చేతల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. తన పెళ్ళాం ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. నిజానికి త్రివిక్రమ్ మేకింగ్ స్టైల్ ఇదైతే కాదని ఇది పూర్తిగా అనిల్ రావిపూడి స్టైల్ లో సాగుతిన్న సినిమాగ్లగా అనిపిస్తుంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ అనిల్ రావిపూడి ని కాపీ చేస్తున్నాడు అంటూ కొంతమంది కొన్ని రకాల కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి త్రివిక్రమ్ సినిమాల్లో భార్యాభర్తల మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒకరి మాట ఒకరు వింటూ చిన్న చిన్న మనస్పర్ధలతో విడిపోయి మళ్లీ కలుసుకునే స్వభావం కలిగిన మనుషులుగా ఆయన చూపిస్తాడు. కానీ ఆయన ఇప్పుడు అనిల్ రావిపూడి జోన్లోకి వెళ్లి ఆయన టైప్ ఆఫ్ స్టోరీలను ఓన్ చేసుకొని సినిమా చేయడం ఎందుకు…
వెంకటేష్ అంటే కేవలం పెళ్ళాం చెప్పిన మాటలు మాత్రమే వినే వ్యక్తిగా చూపించాలా అతనిలో కొత్తగా మనం ఇంకేం చూపించలేమా? అనే రీతిలో కూడా కొంతమంది కొన్ని రకాల కామెంట్లు చేస్తున్నారు… త్రివిక్రమ్ సైతం అదే బాటలో నడవడం కొంతవరకు బాధను కలిగించే విషయమనే చెప్పాలి.
వెంకటేష్ తో ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలను చేస్తే సేఫ్ జోన్ లో ఉండొచ్చు కదా అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. కానీ అంతకుమించిన డిఫరెంట్ అటెంప్ట్ వెంకటేష్ తో చేసి సక్సెస్ ని సాధించవచ్చు కదా అనే ధోరణిలో ఎవరు ఆలోచించడం లేదు. కారణం ఏదైనా కూడా వెంకటేష్ ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తే భారీ సక్సెస్ ను సాధించవచ్చు అనేది వాస్తవం…