Homeఎంటర్టైన్మెంట్Venkatesh Adarsha Kutumbam: భార్య మీద వెంకటేశ్ ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరింది.. ఏంటీ గొడవ

Venkatesh Adarsha Kutumbam: భార్య మీద వెంకటేశ్ ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరింది.. ఏంటీ గొడవ

Venkatesh Adarsha Kutumbam: త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబర్ 2 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి ఇంట్రడ్యూసింగ్ చిట్టిబాబు అంటూ వెంకటేష్ పాత్రకు సంబంధించిన క్యారెక్టరైజేషన్ ను తెలియజేస్తూ ఒక వీడియోను నిన్న రిలీజ్ చేశారు. ఇక ఈరోజు ఇంట్రడ్యూసింగ్ స్వర్ణ అంటూ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కి సంబంధించిన ఒక వీడియోను రిలీజ్ చేశారు… ‘ఇల్లాలే దేవత’ అంటూ స్టార్ట్ […]

Venkatesh Adarsha Kutumbam: త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబర్ 2 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి ఇంట్రడ్యూసింగ్ చిట్టిబాబు అంటూ వెంకటేష్ పాత్రకు సంబంధించిన క్యారెక్టరైజేషన్ ను తెలియజేస్తూ ఒక వీడియోను నిన్న రిలీజ్ చేశారు. ఇక ఈరోజు ఇంట్రడ్యూసింగ్ స్వర్ణ అంటూ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కి సంబంధించిన ఒక వీడియోను రిలీజ్ చేశారు… ‘ఇల్లాలే దేవత’ అంటూ స్టార్ట్ అయిన ఈ వీడియోలో వెంకటేష్ చాలా ఫ్రస్టేషన్ తో ఈ ‘ఆడవాళ్ళకు ఆటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు ‘ అంటూ చెప్పిన డైలాగు వెంకటేష్ లోని ఫ్రస్టేషన్ ని చూపిస్తుంది. ఇక పక్కింట్లో ఉన్న అమ్మాయిని చూస్తూ అదండీ ఆడదంటే కనిపించగానే పువ్వు లాగా ఎలా నవ్వుతుందో చూడండి నా పెళ్ళాం ఉంది పెళ్లయిన కొత్తలో స్మైల్ ప్లీజ్ అంటే నవ్వింది తప్ప ఇప్పటివరకు ఎప్పుడు నవ్వలేదు’ అంటు తన పరిస్థితిని తెలియజేసాడు. మొత్తానికైతే ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ భార్య చేతిలో ఒక ఫ్రస్టేటెడ్ భర్తగా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు ఆయన చేసిన ఎఫ్2 సినిమాలోని క్యారెక్టర్ మళ్ళీ పోషిస్తున్నాడా అనే డౌట్ మనకు కలుగుతుంది.

ముఖ్యంగా తన భార్య తనని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తుంది. తన చేతే అన్ని పనులు చేయిస్తూ ఫలితాన్ని మాత్రం తను తీసుకుంటుంది. ఉదాహరణకి వెంకటేష్ జాబ్ చేస్తే వచ్చే డబ్బుల్ని ఆమె దగ్గర పెట్టుకుంటుంది. కానీ ఇంట్లో పని మొత్తం వెంకటేష్ తో చేయిస్తుంది.

అలాగే తనకంటూ ఒక ఫ్రీడమ్ లేకుండా తన ఫ్రెండ్స్ ని కలవనివ్వకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తుందట. దానివల్ల వెంకటేష్ తీవ్రమైన ఫ్రస్టేషన్ తో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ సినిమా కథ మొత్తం ఫ్యామిలీ బ్యా డ్రాప్ లోనే తిరగబోతుంది. దీనివల్ల వెంకటేష్ ఎలా సఫర్ అయ్యాడు. తన భార్య తనని ఎలా టార్చర్ చేసింది అనేది మన కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏదేమైనా కూడా ఈ సినిమా వెంకటేష్ మార్క్ తో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం పక్క అంటూ సినిమా మేకర్స్ చెబుతున్నారు. వెంకటేష్ టైమింగ్ మాత్రం చాలా అద్భుతంగా సెట్ అయింది. ఆయన చెప్పే డైలాగుల్లో ఇంటెన్సిటీ కనిపించింది.

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper