Adarsha Kutumbam: సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. విక్టరీ వెంకటేష్ లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. గత సంవత్సరం ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్ ను రాబట్టింది.దాంతో వెంకటేష్ పేరు మరోసారి మారుమ్రోగుతుంది. ప్రస్తుతం సీనియర్ హీరోలందరిలో ఆయన ముందు వరుసలో ఉన్నాడు. ఇక వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఫ్యామిలీ నేపథ్యంలోనే తెరకెక్కతుండటం విశేషం… ఇక ఇదిలా ఉంటే ఇంట్రడ్యూసింగ్ చిట్టిబాబు అంటూ ఈ సినిమా నుంచి నిన్న ఒక వీడియో వచ్చింది. అది ప్రస్టేషన్ తో కూడిన వీడియో కావడం తో వెంకటేష్ సైతం చెలరేగిపోయాడు. ఈరోజు ఇంట్రడ్యూసింగ్ స్వర్ణ అంటూ మరో వీడియోని రిలీజ్ చేశారు. ఇది కూడా ఫ్యామిలీ ఫ్రస్టేషన్ లోనే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే త్రివిక్రమ్ ఎందుకని ఈ ఫ్రస్టేషన్ సబ్జెక్ట్ ని ఎంచుకున్నాడు. ఇంతకుముందే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 సినిమాలో ఆయన సినిమాలో ఫ్రస్టేషన్ ఉన్న హస్బెండ్ గా కనిపించాడు.
మరి ఆ సినిమాకి ఈ సినిమాకి ఏదైనా లింకుందా ఆ సినిమాకి సీక్వెల్ గానే ఈ సినిమా తెరకెక్కబోతుందా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుంది. ప్రస్తుతం రిలీజ్ అయిన రెండు వీడియోలు కూడా అనిల్ రావిపూడి బాటలోనే ఉన్నాయంటూ చాలా మంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి వెంకటేష్ నుంచి వచ్చే పత్తి డైలాగు కూడా అనిల్ రావిపూడి సినిమాలో డైలాగ్ లాగే ఉంది. కాబట్టి ఈ సినిమాతో త్రివిక్రమ్ తన పూర్తి ఫామ్ ను కోల్పోయాడు. తనకు ఓన్ గా సబ్జెక్ట్ రాసుకోవడం బద్ధకం అయిపోయి ఇప్పుడు వేరే దర్శకుల బాటలోకి వెళ్తున్నాడా? నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్ను పవర్ ఏంటో మనందరికి తెలుసు…
ఆయన ఒకసారి సిన్సియర్ గా పేపర్ మీద పెన్ను పెడితే అద్భుతమైన కథలను రాయగలిగే క్యాపబిలిటీ ఉన్న దర్శకుడు. ఎందుకని ఆయన మరో దర్శకుడు బాటలోకి వెళ్తున్నాడు. తన ఓన్ స్టైల్ ని తను క్రియేట్ చేయలేకపోతున్నాడా? మొత్తానికైతే ఆదర్శ కుటుంబం అనే టైటిల్ లో త్రివిక్రమ్ మార్క్ కనిపించినప్పటికి సినిమా కథ లో మాత్రం ఆయన మార్క్ పెద్దగా లేనట్టుగా తెలుస్తుంది. అక్టోబర్ 2వ తేదీ వస్తే గానీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయగలుగుతుందా? లేదా అనేది తెలియదు…